Friday, September 11, 2026
Homeఅంతర్జాతీయంభువనగిరిలో ఘనంగా ఏపూరి సోమన్న 25 ఏళ్ల పుస్తకావిష్కరణ

భువనగిరిలో ఘనంగా ఏపూరి సోమన్న 25 ఏళ్ల పుస్తకావిష్కరణ

📰 Generate e-Paper Clip

నిండు సభలో భీమ్ ఇండియా టుడే ప్రతినిధి శ్రీకాంత్‌ కు ఘన సన్మానం

భీమ్ ఇండియా టుడే న్యూస్ భువనగిరి:లో ఏపూరి సోమన్న 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని భువనగిరిలో నిర్వహించిన సభలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ముఖ్య అతిథిగా పాల్గొని ఘనంగా ఆవిష్కరించారు. సోమన్న కళా, సామాజిక ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి అభిమానులు, జర్నలిస్టులు, కళాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏపూరి సోమన్న సమక్షంలో నిండు సభలో భీమ్ ఇండియా టుడే ప్రతినిధి శ్రీకాంత్‌ను మీసాల గణేష్, సురేష్‌లు ప్రత్యేకంగా ఘనంగా సన్మానించారు. శ్రీకాంత్‌కు శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు.

సోమన్న గత 25 సంవత్సరాలుగా పాటలు, ప్రదర్శనల ద్వారా ప్రజా సమస్యలు, సామాజిక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ తనదైన శైలిలో సేవలందిస్తున్నారని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. ఆయన 25 ఏళ్ల ప్రస్థానాన్ని పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమని, ఈ పుస్తకం ఆయన కళా ప్రయాణానికి ఒక గుర్తుగా నిలుస్తుందని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరగడం, అనంతరం నిండు సభలో భీమ్ ఇండియా టుడే ప్రతినిధి శ్రీకాంత్‌కు ప్రత్యేక సన్మానం జరగడంతో కార్యక్రమం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.