Saturday, September 12, 2026
Homeతెలంగాణదళిత బాంధవుడు కె సి ఆర్

దళిత బాంధవుడు కె సి ఆర్

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ దళిత బంధు పథకం ద్వారా పది లక్షల రూపాయలను వారు ఎదుగుదలకు కొన్ని వేల కుటుంబాలకు అందించిన గొప్ప దర్శనికుడు దళితుల బాంధవుడు కల్వకుంట్ల చంద్రశేకర్ రావు అని బిఆర్ఎస్ నాయకులు చదిరం నాగేశ్వరరావు పేర్కొన్నారు 

ఎల్కతుర్తి లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 145 కోట్ల రూపాయలు వెచ్చించి తెలంగాణ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున హైదరాబాదులో నిర్మించడం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని పేర్కొన్నారు

రాష్ట్ర సచివాలయాన్ని గొప్పగా నిర్మించి దానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పేరు నామకరణం చేయడం కేసీఆర్ గారి గొప్పతనం అని పేర్కొన్నారు 

ఇలాంటి గొప్ప నాయకుని మీద ఆయన చావుని కోరుకుని అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను హత్య చేయలని ఉద్దేశంతో వారి ఇంటికి కొన్ని వేల మందిని ఉసి కోల్పడం హేయమైన చర్య అని దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం

125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం కేసీఆర్ గారు నిర్మిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటివరకు అధికారికంగా ఒక కార్యక్రమం చేసింది లేదు కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఒక దండ కూడా ఇప్పటివరకు అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహానికి వేసింది లేదు వీరికి దళిత సమాజం గూర్చి మాట్లాడే నైతిక హక్కు లేదు అని విమర్శిస్తున్నారు 

దళితులను పావుగా వాడుతూ కేసీఆర్ గారు బ్రతికి ఉండంగానే వారి ఇంటి ముందు దళితులచే చావు డబ్బులు కొట్టించడం తీవ్ర నేరమైన చర్య హేయమైన చర్య దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం 

అమాయకమైన దళితులను ముందు పెట్టి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ఉసి కోల్పడాన్ని చూస్తూ ఊరుకునేది లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి నీచ సంస్కృతి చర్యలు మానుకోవాలని లేనిచో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులను ఏకం చేస్తూ ఉవ్వెత్తున ఉద్యమిస్తూ మీ అధికారాన్ని దించేదాకా పోరాడుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి జూపాక జడ్సన్ ఆరేపల్లి రాజయ్య బిఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షులు బొంకూరి కార్తీక్ శనిగరం వంశీ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.