Thursday, September 10, 2026
Homeతెలంగాణరైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఆధునిక యంత్రాలు అందుబాటులో

రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఆధునిక యంత్రాలు అందుబాటులో

📰 Generate e-Paper Clip

హుజురాబాద్‌లో అగ్రి మాల్ ప్రారంభం

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్, సెప్టెంబర్ 9: హుజురాబాద్ పట్టణంలోని వరంగల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన హుజురాబాద్ అగ్రి మాల్‌ను బుధవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ బాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా అగ్రి మాల్‌లో రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు ఆధునిక వ్యవసాయ యంత్రాలను అందుబాటులో ఉంచడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. రైతులకు ఒకే చోట వ్యవసాయానికి అవసరమైన సామగ్రి లభించడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వారు పేర్కొన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రొంటాల సువాసిని మనోజ్ రావు, సీఐ కరుణాకర్, గంగాడి కృష్ణారెడ్డి, బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ ఏడీఏ సునీత, ఏవో భూమిరెడ్డి, ఏఈవోలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అలాగే సుమారు 200 మంది రైతులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అగ్రి మాల్‌ను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన వ్యవసాయ ఉత్పాదకాలను అందుబాటులోకి తీసుకొచ్చిన నిర్వాహకులు బండి కోటేశ్వర్, బోళ్ల కిషోర్‌లను పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రాజకీయ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.