Thursday, September 10, 2026
Homeతెలంగాణఏఎల్ఎం శ్రీనివాస్‌కు ఉత్తమ సేవా అవార్డు ఇవ్వాలని గ్రామస్తుల విజ్ఞప్తి

ఏఎల్ఎం శ్రీనివాస్‌కు ఉత్తమ సేవా అవార్డు ఇవ్వాలని గ్రామస్తుల విజ్ఞప్తి

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ ఎస్సీ గారు పర్యటించి గ్రామంలో విద్యుత్ సరఫరా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కరెంట్ సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయనే విషయంపై గ్రామస్తులతో నేరుగా మాజీ సర్పంచ్ చిర్రా కొమురవెల్లి మాజీ సర్పంచ్ చదిరం వీరస్వామి బోయినపల్లి దేవేందర్ రావు మాచర్ల శంకర్ మాటూరి నరేష్ మరియు గ్రామ ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్సీ గారు మాట్లాడుతూ ప్రజలకు నిరంతరాయంగా మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు విద్యుత్ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు ఎదురైనా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఇదిలా ఉండగా, గత అనేక సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో ఏఎల్ఎంగా విధులు నిర్వహిస్తూ దండేపల్లి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ, విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న వాంకుడోతు శ్రీనివాస్ గారికి ఉత్తమ సేవా అవార్డు అందించాలని గ్రామ ప్రజలు ఎస్సీ గారిని కోరారు. ప్రజలకు అంకితభావంతో సేవలందిస్తున్న శ్రీనివాస్ సేవలను గుర్తించి తగిన గౌరవం కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, ఉపసర్పంచ్ శనిగరపు సందీప్ గ్రామ వార్డ్ మెంబర్ గడ్డం రాజమౌళిదండేపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.