Thursday, September 10, 2026
Homeఆంధ్ర ప్రదేశ్అసెంబ్లీకి రాగానే ముఖ్యమంత్రి  నేరుగా స్పీకర్ గారి ఛాంబర్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు.

అసెంబ్లీకి రాగానే ముఖ్యమంత్రి  నేరుగా స్పీకర్ గారి ఛాంబర్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు.

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ శాసనసభ ఎదుట సోమవారం జరిగిన దురదృష్టకమైన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి శాసనసభ స్పీకర్‌ గారి ఛాంబర్‌లో శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్‌ గారిని పరామర్శించారు.

 శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు అసెంబ్లీ ఆవరణలో సభాపతి గారి పట్ల అసభ్యకరమైన పదజాలంతో దూషించడమే కాకుండా అధికారులపై దాడులకు పాల్పడిన సభ్యుల ప్రవర్తన అనుచితంగా, తెలంగాణ సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన సంఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి  స్పీకర్ గారిని ఓదార్చారు.

 అసెంబ్లీ ఎదుట జరిగిన దురదృష్టకర పరిణామాలపై పత్రికలు, అన్ని మీడియాలు ప్రముఖంగా ప్రచురించడమే కాకుండా టీవీల్లో ప్రసారం చేశాయి. స్పీకర్ గారిని వ్యక్తిగతంగా దూషించటంతో శాసనసభా వేదికగా వారు కంటతడి పెట్టుకున్న దృశ్యాలు చూసి ముఖ్యమంత్రి  ఆవేదన చెందారు.

 మంగళవారం అసెంబ్లీకి రాగానే ముఖ్యమంత్రి  నేరుగా స్పీకర్ గారి ఛాంబర్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు. స్పీకర్ గారిని ఓదార్చి జరిగిన సంఘటనలపై విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధ్యులపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుందని స్పీకర్ గారికి తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.