Sunday, September 13, 2026
Homeఅంతర్జాతీయంమావోయిస్టు మాజీ నేత రాధక్క కన్నుమూత

మావోయిస్టు మాజీ నేత రాధక్క కన్నుమూత

📰 Generate e-Paper Clip

అనారోగ్యంతోచికిత్సపొందుతూ తుదిశ్వాస.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోతొలితరంమహిళా మావోయిస్టునేతగాగుర్తింపు.       మంగళవారం పిప్పల్దరిలో అంత్యక్రియలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆదిలాబాద్, ఆగస్టు 31 (భీమ్ ఇండియా టుడే): మావోయిస్టు పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు కోర్సింగే మోతీబాయి అలియాస్ రాధక్క (65) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 5:55 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తుల్లో విషాదం నెలకొంది.      తొలితరం మహిళా మావోయిస్టు నేతగా..  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని గిరిజన ప్రాంతాల నుంచి మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిన తొలితరం మహిళా నేతల్లో రాధక్క ఒకరిగా ఉన్నారు. మావోయిస్టు ఉద్యమంలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆమె నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ పరిధిలోనూ, ఛత్తీస్‌గఢ్‌లోని సౌత్ బస్తర్ డివిజన్ పరిధిలోనూ వివిధ బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం. డివిజనల్ కమిటీ సభ్యురాలిగా కూడా ఆమె కొంతకాలం పనిచేశారు.                                  అనారోగ్యంతో సాయుధ పోరాటానికి దూరంమావోయిస్టుఉద్యమంలో కొనసాగుతున్న సమయంలో రాధక్క తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆమె సాయుధ పోరాటానికి దూరమై, అనంతరం ఆదిలాబాద్‌లోనే సాధారణ జీవితం గడుపుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న ఆమె ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించడంతో రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వైద్యుల చికిత్సకు స్పందించక సోమవారం సాయంత్రం మృతి చెందారు. భర్త కూడా మాజీ మావోయిస్టు నేతే..      రాధక్క భర్త పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న కూడా మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన మాజీ నేతగా ఉన్నారు. ఆయన మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మాజీ సభ్యుడిగా పనిచేశారు. అనారోగ్య కారణాలతో 2025 అక్టోబర్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. రాధక్క కూడా అనారోగ్య కారణాలతో ఉద్యమాన్ని వీడి సాధారణ జీవితాన్ని కొనసాగించారు.  పలువురి సంతాపం.                              రాధక్క మృతివార్త తెలుసుకున్న పలువురు ప్రజాసంఘాల నాయకులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమెతో పరిచయం ఉన్నవారు, కుటుంబ సభ్యులు ఆమె మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం ఉద్యమ జీవితంలో కొనసాగిన రాధక్క అనంతరం అనారోగ్య కారణాలతో సాధారణ జీవితంలోకి వచ్చినట్లు పేర్కొన్నారు.                                   పిప్పల్దరిలో అంత్యక్రియలు.                  రాధక్క మృతదేహానికి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్ మండలం పిప్పల్దరి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె బంధువులు వెల్లడించారు. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు హాజరుకానున్నారు.

రాధక్క మృతి నేపథ్యంలో గతంలో మావోయిస్టు ఉద్యమంలో పనిచేసి, అనంతరం వివిధ కారణాలతో జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టుల జీవిత ప్రయాణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం చేపడుతున్న పునరావాస చర్యల ద్వారా పలువురు మాజీ మావోయిస్టులు సాధారణ జీవితంలోకి వస్తున్న నేపథ్యంలో రాధక్క మృతి కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.