మావోయిస్టు మాజీ నేత రాధక్క కన్నుమూత
అనారోగ్యంతోచికిత్సపొందుతూ తుదిశ్వాస.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోతొలితరంమహిళా మావోయిస్టునేతగాగుర్తింపు. మంగళవారం పిప్పల్దరిలో అంత్యక్రియలు భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆదిలాబాద్, ఆగస్టు 31 (భీమ్ ఇండియా టుడే): మావోయిస్టు పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు కోర్సింగే మోతీబాయి అలియాస్ రాధక్క (65) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 5:55 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తుల్లో విషాదం నెలకొంది. ...