Sunday, September 13, 2026
Homeతెలంగాణసామాజిక స్పృహ కలిగిన ఉద్యమ కవి ఏపూరి సోమన్న

సామాజిక స్పృహ కలిగిన ఉద్యమ కవి ఏపూరి సోమన్న

📰 Generate e-Paper Clip

కె.యూ రిజిస్టర్ ఆచార్య రామచంద్రం

భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ. కేయూ సేనెట్ హల్ లో ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న గారి 25 సంవత్సరాల ఏపూరి పాటల ప్రవాహం పుస్తకాన్ని ఆవిష్కరించిన రిజిస్టర్ ఆచార్య రామచంద్రం* వారు మాట్లాడుతూ సోమన్నకు హృదయపూర్వక అభినందనలు,శుభాకాంక్షలు తెలుపుతూ 25 సంవత్సరాల పాటల ప్రయాణం అంటే కేవలం కాలం గడిచిన చరిత్ర కాదు, సంవత్సరాల ప్రజా చైతన్య ప్రయాణం,సామాజిక స్పృహతో ఉద్యమ స్ఫూర్తి పాటలు పాడిన గొప్ప కవి సోమన్నని రిజిస్టర్ అభివర్ణించాడు,ఈ కార్యక్రమం తెలంగాణ ప్రజాయుద్ధనౌక ఏపూరి సోమన్న మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను గౌరవించాలని కళాకారులకు 100 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, కళాకారులకు గ్రామపంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు చట్టసభల్లో ఐదు శాతం వాటా కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా యువత మత్తు బానిస పడకుండా వారినీ చైతన్యవంతం చేయడం కోసం రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాలను పర్యటన చేస్తానని,సామాజిక న్యాయం కల్పించే విధంగా నా పాట తో మరో 30 ఏళ్లు ప్రజల కోసం పాటతో జీవిస్తానని సోమన్న అన్నారు. అనంతరం పుస్తక సమీక్షకు వచ్చిన కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ మాట్లాడుతూ

పాట అనేది కేవలం వినోదం కాదు.పాట ఒక ఆయుధం…

పాట ఒక సందేశం పాట ఒక ప్రశ్న పాట ఒక మార్పుకు నాంది సోమన్న తెలంగాణ ఉద్యమ సమయంలో పాటలు ప్రజలను ఏకం చేసినట్లే, నేటి సమాజంలో కూడా ప్రజల సమస్యలను, బహుజనుల ఆకాంక్షలను, సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఏపూరి సోమన్న గారి పాటలు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నాయి అని వారు అన్నారు, అనంతరం విశిష్ట అతిథిగా వచ్చిన కేయూ పాలక మండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజ్ గౌడ్ మాట్లాడుతూ

“ప్రజల గొంతు వినిపించే సోమన్న ప్రజల గుండెల్లో నిలిచే విధంగా తెలంగాణ ఉద్యమ పాటలు పాడిన వాగ్గేయకారుడు సోమన్న వారి పాటల్లో మట్టి వాసన ఉంది.ప్రజల జీవన వేదన ఉంది.బహుజనుల ఆశ ఉంది.

సామాజిక సమానత్వం కోసం తపన ఉంది.అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం ఉంది.

తెలంగాణ సంస్కృతి, తెలంగాణ యాస, తెలంగాణ ప్రజల జీవన విధానం ఆయన పాటల్లో సజీవంగా కనిపిస్తాయి. అందుకే ఆయన పాటలు కేవలం వేదికపైన వినిపించే పాటలు కాకుండా, ప్రజల మధ్య నుంచి పుట్టి ప్రజల మధ్యకే చేరే పాటలుగా నిలుస్తున్నాయి వారు అన్నారు కార్యక్రమం పాల్గొన్నవారు డా,,సంకినేని వెంకట్,బరిగెల బాబు, వరంగల్ ఉమ్మడి జిల్లా కళాకారులు, దార దేవేందర్, జూపాక శివ, మైసన్న సునీల్,విద్యార్థి నాయకులు మనోహర్,మంద నరేష్, వందమంది కళాకారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.