కాటారం మండలంలో కాంగ్రెస్‌కు గ్రామగ్రామాన కాంగ్రెస్ పటిష్టం.
. భీమ్ ఇండియా టుడే న్యూస్ భూపాలపల్లి కాటారంలో పార్టీకి కొత్త జోష్…!కాటారం మండలంలో కాంగ్రెస్ దూకుడు,గ్రామ కమిటీలతో క్షేత్రస్థాయిలో బలోపేతం.!ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా బలంగా.. కాటారంలో సంస్థాగతంగా పటిష్ట అడుగులు..!
కాటారం మండలమంతా కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం..!గ్రామ కమిటీల ఏర్పాటుతో కాటారంలో కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయి బలం..!కాటారంలో కాంగ్రెస్ పునర్వైభవానికి గ్రామస్థాయి కమిటీలే బాట..!మేడిపల్లి, చింతకాని, ఇబ్రహీంపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖలు ఏకగ్రీవంగా ఎన్నిక:
గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేసే దిశగా మండల అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి నాయకత్వం:
కాటారం మండలంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకత్వం చర్యలు చేపట్టింది. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మేడిపల్లి, చింతకాని, ఇబ్రహీంపల్లి గ్రామ కాంగ్రెస్ శాఖల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాల్లో పార్టీకి బలమైన సంస్థాగత పునాది కల్పించడం, కార్యకర్తలను సమన్వయం చేయడం, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పార్టీ దృష్టికి తీసుకురావడమే లక్ష్యంగా నూతన కమిటీలను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా తెప్పల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ…. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలతో నిత్యం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. గ్రామ కమిటీలు క్రియాశీలకంగా పనిచేస్తేనే పార్టీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
మేడిపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ:
గౌరవ అధ్యక్షుడిగా గుంటి మల్లయ్య, అధ్యక్షుడిగా లిక్కి రాజమౌళి, ఉపాధ్యక్షులుగా గుండ్ల లక్ష్మణ్, గుంటి స్వామి, ప్రధాన కార్యదర్శిగా పొలం లక్ష్మీ స్వామి, కోశాధికారిగా గడవని సమ్మయ్యలను నియమించారు.
మేడిపల్లి యూత్ కాంగ్రెస్ కమిటీ:
అధ్యక్షుడిగా గాదె రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా గుంటి హనుమంతు, పెరుమండ్ల శివకుమార్, ప్రధాన కార్యదర్శిగా మరవేని లక్ష్మణ్, కోశాధికారిగా కృష్ణ స్వామిలను నియమించినట్లు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేష్ గౌడ్ తెలిపారు.
చింతకాని గ్రామ కాంగ్రెస్ కమిటీ:
అధ్యక్షుడిగా వడ్లకొండ సతీష్, ఉపాధ్యక్షులుగా రాచర్ల లస్మయ్య, ఓడెల బాపు, ప్రధాన కార్యదర్శులుగా ఐలాపురం రామక్రిష్ణ, ఎం.డి. చంద్ పాషా, కార్యదర్శులుగా ఆతుకూరి మధునయ్య, ఆతుకూరి ఎల్లయ్య, ముక్కెర వెంకటస్వామి, కోశాధికారిగా పల్లె వెంకటస్వామిలను నియమించారు.
ఇబ్రాహీంపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ:
అధ్యక్షుడిగా ఎం.డి. మోహిజ్ హరూన్ ఖాన్, ఉపాధ్యక్షులుగా కుదుదుల ముత్తయ్య, ఐలాపురం రాజు, ప్రధాన కార్యదర్శులుగా మరిశెట్టి శ్రీనివాస్, ఎస్.డి. అలిమ్ ఖాన్, కార్యదర్శులుగా ఎం.డి. రహీం ఖాన్, గర్రేపల్లి సుధాకర్, కోశాధికారిగా మంతెన శ్రీనివాస్‌లను నియమించారు.
గ్రామాల్లో పార్టీకి పటిష్టమైన పునాది:
కాటారం మండలంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడంతో పాటు యువత, మహిళలు, కార్యకర్తలను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని నూతన కమిటీలు నిర్ణయించుకున్నాయి. గ్రామ కమిటీల ఏర్పాటు ద్వారా పార్టీకి క్షేత్రస్థాయిలో మరింత బలం చేకూరుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, కార్యదర్శి అంగజాల అశోక్, మాజీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, మంథని నియోజకవర్గ యూత్ అధ్యక్షులు చీమల సందీప్, యూత్ కాంగ్రెస్ కాటారం మండల అధ్యక్షులు చిటూరి మహేష్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేష్ రెడ్డితో పాటు గడవేని దేవేందర్, రెవెల్లి సమ్మయ్య, దబ్బెట రాజేశం, అయిలినేని నవీన్ రావు, కరెంగల తిరుపతి గౌడ్, కామీడీ వెంకటరెడ్డి, కొట్టే శ్రీహరి, వెంకట్ రాజం, ఆత్కూరి ప్రభాకర్, బండారి శ్రీధర్, చీర్ల తిరుపతిరెడ్డి, జాగరి రాజబాపు, కోసారి భాస్కర్, ఎండీ బాబా, ఆత్మకూరి కుమార్ యాదవ్, గోనే మహేష్, కొండగొర్ల రామ్ నారాయణ, మేడిపల్లి కిరణ్, కొండ్ర శివ, సంతోషం దేవేందర్ రెడ్డి, ఎస్.కే. రహీమ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన గ్రామ కమిటీల ఏర్పాటుతో కాటారం మండలంలో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో మరింత బలం చేకూరుతుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేశారు.

