Monday, September 14, 2026
Homeతెలంగాణవిద్యార్థి నాయకుడిగా మొదలు.. ప్రజా నాయకుడిగా ఎదుగుదల...!

విద్యార్థి నాయకుడిగా మొదలు.. ప్రజా నాయకుడిగా ఎదుగుదల…!

📰 Generate e-Paper Clip

విద్యార్థి నాయకుడిగా మొదలు.. ప్రజా నాయకుడిగా ఎదుగుదల…!

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ గందె శ్రీనివాస్‌ రాజకీయప్రస్థానంలో మరో విజయ శిఖరం.!!!!ఉద్యమ స్ఫూర్తి నుంచి.. ప్రజా తీర్పు వరకు…!హుజురాబాద్‌ రాజకీయాల్లోగందె శ్రీనివాస్‌ మరో మైలురాయి.!!!!వార్డు బరిలో గెలుపు జెండా….! ఏళ్ల రాజకీయ అనుభవానికి ప్రజల మద్దతు.. కౌన్సిలర్‌గా గందె శ్రీనివాస్‌ ఘన విజయం.!!!! తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడిగా మొదలు.. ఉద్యమ స్ఫూర్తితో టీఆర్‌ఎస్‌లోకి అడుగు. భార్య రాధికకు రెండుసార్లు కౌన్సిలర్‌అవకాశం.. ఏకగ్రీవంగా చైర్మన్‌ పదవి. 2026లో మూడో వార్డు నుంచి బరిలోకి..ప్రజల తీర్పుతో శ్రీనివాస్‌కు ఘన విజయం.! ప్రజా జీవితంలో కొత్త బాధ్యతతో ముందుకు సాగుతున్న హుజురాబాద్‌ కౌన్సిలర్‌ గందె శ్రీనివాస్‌. రాజకీయ ఆసక్తి నుంచి ప్రజా జీవితానికి విద్యార్థి నాయకుడిగా మొదలైన ప్రస్థానం..

నేడు కౌన్సిలర్‌గా ప్రజాసేవకు మరో అడుగుకుటుంబ రాజకీయ నేపథ్యం లేకున్నా ప్రజలతో మమేకమై ఎదిగిన గందె శ్రీనివాస్…

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాకపోయినా.. ప్రజా సమస్యలపై ఆసక్తి, నాయకత్వ లక్షణాలు, ప్రజలతో మమేకమయ్యే తత్వంతో రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు గందె శ్రీనివాస్. విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం.. వివిధ దశలను దాటుకుంటూ నేడు కౌన్సిలర్‌గా ప్రజాసేవలో కొనసాగుతోంది.యువకుడిగా ఉన్న సమయంలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న శ్రీనివాస్.. తెలుగు విద్యార్థి నాయకుడిగా, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగించిన పోరాటం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని శ్రీనివాస్ పేర్కొన్నారు. దీంతో 2011లో అప్పటి టీఆర్ఎస్‌లో చేరి తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించారు.

రాజకీయ వారసత్వం భార్య కుటుంబం నుంచి..

శ్రీనివాస్ కుటుంబానికి ప్రత్యక్షంగా రాజకీయ నేపథ్యం లేకపోయినా.. ఆయన భార్య రాధిక కుటుంబానికి మాత్రం రాజకీయ అనుభవం ఉంది. రాధిక తల్లిదండ్రులు గతంలో సర్పంచులుగా పనిచేసి గ్రామస్థాయి ప్రజా జీవితంలో సేవలందించారు. దీంతో కుటుంబ జీవితంతో పాటు రాజకీయ, ప్రజా సంబంధాలపై కూడా రాధికకు అవగాహన ఏర్పడింది.

1997లో శ్రీనివాస్–రాధికల వివాహం జరిగింది. అప్పటికే శ్రీనివాస్ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల పట్ల ఆసక్తితో ముందుకు సాగుతున్నారు. వివాహానంతరం కూడా ప్రజా జీవితంలో ఆయన ప్రస్థానం కొనసాగింది.

2014లో గందే శ్రీనివాస్ భార్యకుమున్సిపల్ చైర్మన్ గా తొలిఅవకాశం..

రాజకీయ జీవితంలో కీలక మలుపు 2014లో వచ్చింది. ఆ సమయంలో వారి వార్డు జనరల్ మహిళా కేటగిరీకి కేటాయించడంతో రాధిక కౌన్సిలర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో కుటుంబం నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా రాధిక ప్రజాసేవలోకి అడుగుపెట్టారు.ఆ తర్వాత 2020లో వార్డు జనరల్ స్థానంగా ఉన్నప్పటికీ, చైర్మన్ పదవికి జనరల్ మహిళా రిజర్వేషన్ రావడంతో మరోసారి రాధికను కౌన్సిలర్‌గా బరిలో నిలిపారు. ఆ ఎన్నికల్లో ఆమె హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించారు. ప్రజలతో సన్నిహితంగా ఉంటూ తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించారు.

ప్రజలకు మళ్లీ గుర్తుకొస్తున్న గందే రాధిక–శ్రీనివాస్ సేవలు….!

ఆ సేవలే, నేడు జ్ఞాపకాలుగా….!

హుజురాబాద్ ప్రజల మదిలోచెరిగిపోని సేవా ముద్ర: కుల, మత, పార్టీలకు అతీతంగాఅందరినీ కలుపుకున్న నాయకత్వం:

పట్టణ అభివృద్ధిలో వారి కృషిపై మరోసారి చర్చఆ సేవలే.. నేడు జ్ఞాపకాలుగా….!

గందే రాధిక–శ్రీనివాస్ దంపతుల పాలనను గుర్తు చేసుకుంటున్న హుజురాబాద్

ప్రజలతో మమేకమైన నాయకత్వం.. అభివృద్ధికి పెద్దపీట,అలాంటి సేవా నాయకత్వం మళ్లీ రావాలి,అంటూ ప్రజల మాట

హుజురాబాద్‌కు ఆ జోడీ చేసిన సేవలు మరిచిపోలేం…..!మున్సిపల్ చైర్మన్‌గా గందే రాధిక, సేవలకు ప్రశంసలు.అందరినీ కలుపుకుపోయిన శ్రీనివాస్ దంపతుల సేవా దృక్పథం,అభివృద్ధి పనులే వారి పాలనకు గుర్తుగా నిలిచాయంటున్న విశ్లేషకులు.

హుజురాబాద్ ప్రజల మదిలోచెరిగిపోని మున్సిపల్ పాలన కుల, మత, పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకున్న నాయకత్వం

పట్టణ అభివృద్ధిలో చేసిన కృషినే నేడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారా…? హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్‌గా గతంలో సేవలందించిన గందే రాధిక–శ్రీనివాస్ దంపతుల సేవలు ప్రస్తుతం పట్టణంలో మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు చేసిన కృషిని పలువురు పట్టణవాసులు గుర్తు చేసుకుంటున్నారు.

హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించడంతో పాటు, కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకు సాగిన తీరు అప్పట్లో ప్రశంసలు అందుకుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రజా సమస్యలపై స్పందించడం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను ప్రజలు ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు.

ఎందుకు ఇప్పుడు గుర్తుకొస్తున్నారు…?

ప్రస్తుతం పట్టణంలో వివిధ వర్గాల మధ్య గందే రాధిక–శ్రీనివాస్ దంపతుల గత సేవలపై చర్చ సాగుతుండటానికి కారణమేంటనే ఆసక్తి నెలకొంది. గత పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలతో ఉన్న అనుబంధమే వారి సేవలను ఇప్పటికీ గుర్తు చేసుకునేలా చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రజా సేవలో నిస్వార్థంగా పనిచేసిన నాయకత్వం కాలం గడిచినా ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోతుందనడానికి గందే రాధిక–శ్రీనివాస్ దంపతుల సేవలపై జరుగుతున్న చర్చే నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

2026లో శ్రీనివాస్‌కు ప్రత్యక్ష రాజకీయ విజయం:

రాజకీయ ప్రయాణంలో మరో కీలక ఘట్టం 2026లో చోటుచేసుకుంది. వార్డు రిజర్వేషన్ మార్పులో భాగంగా బీసీలకు కేటాయింపులు జరగడంతో మూడో వార్డు జనరల్ కావడంతో శ్రీనివాస్ స్వయంగా ఎన్నికల బరిలోకి దిగారు.

ఇప్పటివరకు భార్య రాధిక ద్వారా స్థానిక రాజకీయాల్లో కొనసాగిన కుటుంబం.. ఈసారి శ్రీనివాస్ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయడంతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రజల మద్దతుతో ఆయన కౌన్సిలర్‌గా విజయం సాధించారు.

ప్రజాసేవే లక్ష్యంగా..

విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన రాజకీయ ప్రయాణం.. పార్టీ కార్యకర్తగా, ఉద్యమకారుడిగా, ప్రజా సమస్యలపై స్పందించే నాయకుడిగా సాగి.. చివరకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా శ్రీనివాస్‌ను నిలిపింది.రాజకీయ వారసత్వం లేకపోయినా.. ప్రజలతో ఉన్న అనుబంధమే తన రాజకీయ బలం అని భావించే గందె శ్రీనివాస్‌కు, కౌన్సిలర్‌గా తాజా విజయం ప్రజాసేవలో మరింత బాధ్యతను పెంచింది. రాబోయే రోజుల్లో వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.