Friday, August 28, 2026
HomeEditorialభూపాలపల్లి జిల్లా పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది.

భూపాలపల్లి జిల్లా పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది.

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ భూపాలపల్లి జయశంకర్ ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి ఉండాలి.. ప్రతి హృదయంలో దేశభక్తి వెల్లివిరియాలి.. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి

భూపాలపల్లి: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నారపరాజు రామచంద్రరావు గారి ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హర్ ఘర్ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు.

జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ ఏడునూతుల నిషిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్ టెంపుల్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు నిర్వహించిన తిరంగా యాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. చందుపట్ల కీర్తి రెడ్డి  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

జాతీయ జెండాలను చేతబూని బీజేపీ నాయకులు, కార్యకర్తలు దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది.

అనంతరం డా. చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ, జాతీయ జెండా ప్రతి భారతీయుడి గౌరవానికి ప్రతీక అని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తెలిపారు.

హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కేవలం ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం మాత్రమే కాదు.. ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి భావాన్ని మరింత బలపరచడం” అని అన్నారు. ప్రతి కుటుంబం తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలని, జాతీయ జెండాను గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని డా. కీర్తి రెడ్డి పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. మన జెండా – మన గౌరవం.. మన దేశం – మన బాధ్యత. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి.. ప్రతి హృదయంలో దేశభక్తి వెల్లివిరియాలి” అని ఆమె అన్నారు.

హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ దేశభక్తి స్ఫూర్తితో ఘనంగా నిర్వహించాలని డా. చందుపట్ల కీర్తి రెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి ప్రసాదరావు, జన్నే మొగిలి, ఎరుకల గణపతి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాలుగో వార్డు కౌన్సిలర్ కన్నం యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్, పెండ్యాల రాజు అర్బన్ అధ్యక్షులు సంపత్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సేనాపతి, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుప్పటి భద్రయ్య, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దేశెట్టి గోపాల్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిఫ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాజనాయక్, లీగల్ సెల్ కన్వీనర్ చీర్ల అశోక్ రెడ్డి ఎండోమెంట్ కన్వీనర్ జయపాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డిజిల్లా కార్యదర్శి శివరాత్రి వేణు జిల్లా నాయకులు తుమ్మిటి రామిరెడ్డి తిరుపతి రవికుమార్ కంబాల రాజన్న పొన్నాల కొమరయ్య రవీందర్ అర్బన్ ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి . బీజేవైఎం నాయకులు ఊడత నాగరాజు లాడే శివ భగవాన్ దేవేందర్                     అలాగే రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, బూత్ అధ్యక్షులు, బీజేపీ కార్యకర్తలు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.