భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి యువతీ యువకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
యువత ఆలోచనలకు ప్రోత్సాహం, వారి ప్రతిభకు వేదిక, వారి ప్రయత్నాలకు అవసరమైన వనరులను అందిస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరు. పేదరికం, అసమానతలు, నిరుద్యోగం, వాతావరణ మార్పులు, సాంకేతిక పరిజ్ఞానంలోని అంతరాలు వంటి సవాళ్లను అధిగమించేందుకు యువతకు అవకాశాలు, వనరులు, నైపుణ్యాలు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. యువతకు సరైన విద్య, నైపుణ్యం, క్రీడలు, ఉపాధి, నాయకత్వ అవకాశాలు కల్పించినప్పుడే బంగారు భవిష్యత్తును నిర్మించగలం. ప్రజా ప్రభుత్వం యువతకు అండగా నిలుస్తోంది. ఏఐ కారణంగా వైట్ కాలర్ జాబ్స్ ప్రమాదంలో పడుతున్న పరిస్థితుల్లో బ్లూకాలర్ జాబ్స్ అందిపుచ్చుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది.
భవిష్యత్ సవాళ్లను అధిగమించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన ఏటీసీలు, స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్ యూనివర్సిటీ వంటివి మంచి ఫలితాలు అందిస్తున్నాయి. టామ్కామ్ ద్వారా సింగపూర్, జపాన్, జర్మనీ వంటి దేశాల్లో అవకాశాలను దక్కించుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాం.
యువత వ్యసనాలకు బారిన పడకుండా మాదకద్రవ్యాల నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. యువత స్పష్టమైన లక్ష్యాలను ఎంచుకుని ముందుకు సాగాలి. యువతే మన బలం – యువతే మన భవిష్యత్తు. యువతకు శుభాభినందనలు” అని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.

