అంతర్జాతీయ యువజన దినోత్సవం
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి యువతీ యువకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. యువత ఆలోచనలకు ప్రోత్సాహం, వారి ప్రతిభకు వేదిక, వారి ప్రయత్నాలకు అవసరమైన వనరులను అందిస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరు. పేదరికం, అసమానతలు, నిరుద్యోగం, వాతావరణ మార్పులు, సాంకేతిక పరిజ్ఞానంలోని అంతరాలు వంటి సవాళ్లను అధిగమించేందుకు యువతకు అవకాశాలు, వనరులు, నైపుణ్యాలు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. యువతకు సరైన విద్య, నైపుణ్యం, క్రీడలు, ఉపాధి, నాయకత్వ అవకాశాలు...