భీమ్ ఇండియా టుడే న్యూస్:– స్నేహం ” స్నేహితుల కలయిక లేక గత జ్ఞాపకాలు కరువు
ఇప్పుడు ప్రపంచాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్య ‘స్నేహితుల కొరత’. ఇది నిజం.
1960లలో ఒక వ్యక్తికి సగటున 100 మంది వరకు సన్నిహిత స్నేహితులు ఉండేవారట. 1990ల నాటికి ఆ సంఖ్య 50కి పడిపోయింది. 2020 వచ్చేసరికి అది 10కి చేరింది. ఇప్పుడు ఒక్క నిజమైన స్నేహితుడు దొరకడమే గగనంగా మారింది. ఇటీవలి సర్వే ప్రకారం మన దేశంలో 12% మందికి చెప్పుకోదగ్గ స్నేహితుడే లేడట.
ఒకప్పుడు రోజుకు కనీసం గంటసేపు స్నేహితులతో ముఖాముఖిగా గడిపేవాళ్లు ఇప్పుడు 35 నిమిషాలు. మనసు విప్పి మాట్లాడే మనుషుల సంఖ్య తగ్గింది.
స్నేహితులు లేని ఒంటరితనం రోజుకు 20 సిగరెట్లు తాగినంత ప్రమాదకరమని పరిశోధనలు చెబుతున్నాయి. ఒత్తిడి, డిప్రెషన్ వారిని చుట్టుముడతాయి.
మంచి స్నేహితులున్నవారిలో రక్తపోటు, గుండె జబ్బులు చాలా తక్కువగా వస్తున్నాయట.
స్నేహితులు తోడుంటే ఆహ్లాదంగా ఉంటుంది. కలిసి వ్యాయామం చేయడం, ఆటలు ఆడడం, కొత్త పనులు చేయడం సులభమవుతుంది. సాంగత్యం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
స్నేహం ఊరికే పుట్టుదు. దానికి సమయం కావాలి. స్నేహం కుదిరాక నిలుపుకోవడానికి రోజూ కాస్త సమయం కేటాయించాలి. మొక్కకు నీళ్లలా, స్నేహానికి ‘కబుర్లు’ అవసరం.
ఆఫీస్ స్నేహాలు అవసరాల వరకే, బాహ్య పలకరింపులే. సోషల్ మీడియా స్నేహాలు చాలావరకు కాలక్షేపాలే. బార్ &రెస్టారెంట్ స్నేహాలు కబుర్లు, నవ్వులు మత్తు దిగిపోతే మాయం. స్నేహబంధాలు తగ్గిపోవడానికి కారణం సమయం లేకపోవడం.
డబ్బు సంపాదించే యంత్రాల్లా మారిపోయాం. బంధాలను నిలుపుకోవడం మర్చిపోయాం.
రోజులో 15 నిమిషాలైనా స్నేహితులకి ఫోన్ చేయండి. వారంలో ఒకసారైనా కలవండి. క్వాలిటీ టైమ్ ఇవ్వండి: కలిసినప్పుడు మనసుపెట్టి మాట్లాడండి.
కొత్త స్నేహాలను పెంచుకోండి: మనుషులతో మాట కలపండి. ఉన్న స్నేహాలను కాపాడండి: చిన్న చిన్న మనస్పర్థలకు స్నేహాన్ని వదులుకోకండి. ‘సారీ’, ‘థ్యాంక్స్’ చెప్పడానికి వెనకాడకండి.
చివరి శ్వాస వరకు మనతో నడిచేది మంచి స్నేహితులు మాత్రమే. చాలాకాలంగా మాట్లాడని ఫ్రెండ్ కి మెసేజ్ పెట్టండి. ఫోన్ చేయండి
జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ…..

