Friday, August 28, 2026
HomeEditorialపేపర్ లీకేజ్ వ్యవహారంపై న్యాయం

పేపర్ లీకేజ్ వ్యవహారంపై న్యాయం

📰 Generate e-Paper Clip

పేపర్ లీకేజ్ విద్యార్థులు పోలీసుల మధ్య ఉద్రిక్తత

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్:- హైదరాబాద్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు ర్యాలీగా ముందుకు సాగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మరియు పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.విద్యార్థులు పేపర్ లీకేజ్ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మాణిక్యాపూర్ గ్రామ, విద్యార్థులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు యువ నాయకులు గ్రామ పెద్దలు అందరూ రేపు ఉదయం 10 గంటలకు మన ఉమ్మడి గ్రామం మాణిక్యపూర్ బస్టాండ్ దగ్గర నిరసన కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనగలరు.నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీకి నిరసనగా డిల్లీ మంతర్ దగ్గర సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరాహార.., నిరసన దీక్షకు మా మద్దతు, తెలుపుతూ…

మా ప్రధాన డిమాండ్లు

నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీకి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి.

ఈ లీకేజీకి బాధ్యులైన అధికారులు, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని, వారిని విధుల నుండి పూర్తిగా తొలగించాలి.

నీట్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున పరిహారం అందించాలి.

విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.

నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం, దమనకాండను వెంటనే నిలిపివేయాలి.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శకమైన, నిష్పాక్షికమైన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

నిర్వాహకులు:-ఉమ్మడి మాణిక్యాపూర్ గ్రామ ప్రజా సంఘాలు ప్రజలు విద్యార్థులు సంఘ నాయకులు పార్టీ నాయకులు మేధావులు

భీమ్ ఇండియాటుడే న్యూస్:-ప్రజా సమస్యలే మా ప్రాధాన్యత – న్యాయం కోసం నిస్వార్థ పోరాటం

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.