హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంధి పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వినతి
మంత్రి వెంటనే కాల్ పర్ చేసి చర్యలు తీసుకోవాలి అధికారులకు హెచ్చరిక
వైద్యులు, నర్సుల ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
ఓపీ, స్కానింగ్ సేవల్లో రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంపై దృష్టి సారించి మెరుగైన వైద్య సేవలు అందించాలి
హైదరాబాద్, అక్టోబర్ 29:
హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. ఈ మేరకు గురువారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రిని కలిసి ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు మంత్రి గారు వెంటనే కాల్ పర్ చేసి చర్యలు తీసుకోవాలి అధికారులకు హెచ్చరించారు
నిన్న జరిగిన ఘటనతో పాటు ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే
హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న చోటుచేసుకున్న వ్యవహారంపై, అలాగే వైద్యులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం జరుగుతోందని రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందాల్సి ఉండగా, అవసరమైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.
ఓపీ సేవల్లో ఇబ్బందులు.. స్కానింగ్ కోసం రోగుల అవస్థలు
హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వైద్యం కోసం వస్తుంటారు. ఇలాంటి సమయంలో ఓపీ సేవలు సక్రమంగా అందకపోవడం, స్కానింగ్ వంటి కీలక వైద్య పరీక్షల విషయంలో రోగులు ఇబ్బందులు ఎదుర్కోవడం ఆందోళన కలిగించే అంశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఎన్ని సార్లు రివ్యూ మీటింగ్ లు పెట్టి చెప్పిన సిబ్బంది మారడం లేదు అని అన్నారు
ప్రభుత్వ ఆసుపత్రిలోనే అవసరమైన వైద్య పరీక్షలు అందుబాటులో ఉండాల్సిన పరిస్థితుల్లో, రోగులు ఇతర ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తే పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. ముఖ్యంగా అత్యవసరంగా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన రోగులకు ఇబ్బందులు కలగకుండా, స్కానింగ్ సేవలు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులతో పాటు నర్సులు, ఇతర అవసరమైన వైద్య సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేశారు. సరిపడా వైద్యులు, నర్సులు అందుబాటులో ఉంటేనే రోగులకు సకాలంలో పరీక్షలు నిర్వహించి, మెరుగైన చికిత్స అందించేందుకు వీలవుతుందని వివరించారు.
వైద్య సిబ్బంది కొరత కారణంగా రోగులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు తలెత్తకుండా చూడాలని, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సిబ్బంది విధులను బాధ్యతాయుతంగా నిర్వహించేలా పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా, రోగుల పట్ల సానుకూలంగా వ్యవహరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్న మంచి పేరును నిలబెట్టాలి
హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి కెసిఆర్ గారి ప్రభుత్వం లో ప్రజల్లో మంచి గుర్తింపు, నమ్మకం ఉన్నాయని, ఆ పేరును మరింత నిలబెట్టేలా వైద్య సేవలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన వైద్యం అందాలని, ముఖ్యంగా పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు.
ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, వైద్యులు మరియు సిబ్బంది కొరతను అధిగమించడంతో పాటు ఓపీ, స్కానింగ్ సేవలను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. రోగుల ఇబ్బందులను నిర్లక్ష్యం చేయకుండా, ప్రజలకు అందుబాటులో ఉండే వైద్య వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు.
ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలి
హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆసుపత్రిలోని సమస్యల పరిష్కారానికి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఖాళీ పోస్టుల భర్తీ, అవసరమైన వైద్య సదుపాయాల కల్పన, స్కానింగ్ సేవల మెరుగుదల, సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ వంటి అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహకు అందజేసిన వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు వెంటనే మంత్రి గారు స్పందించి సిబ్బంది మరియు డాక్టర్స్ పై చర్యలు తీసుకుంటాం అని కాళీ ఉన్న సిబ్బంధిని భర్తీ చేస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది
హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా, వారికి అవసరమైన సేవలు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.

