Friday, October 23, 2026
Homeతెలంగాణతెలంగాణలో కొత్త లిఫ్ట్ ఇరిగేషన్

తెలంగాణలో కొత్త లిఫ్ట్ ఇరిగేషన్

📰 Generate e-Paper Clip

తెలంగాణలో కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం!

నీళ్లు, కరెంటు లేక ఎండిపోతున్న వరి పంటలు.. ట్యాంకర్లతో నీటిని పారిస్తున్న రైతులు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హసన్‌పర్తి: తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి కష్టాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పొలాలకు నీరు, విద్యుత్ సరఫరా అందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించినట్లుగా కనిపించే పరిస్థితులు రాష్ట్రవ్యాప్తంగా పొలాల్లో ట్యాంకర్లతో నీటిని పారిస్తున్న దృశ్యాల రూపంలో దర్శనమిస్తున్నాయి.

హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో ఓ రైతు తన ఎనిమిది ఎకరాల వరి పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు. పొలానికి నీరు అందక, విద్యుత్ సరఫరా లేక వరి పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడటంతో నాలుగు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పంటకు పారిస్తున్నాడు.

సాధారణంగా కాలువలు, బోర్లు, సాగునీటి వనరుల ద్వారా పంటలకు నీరు అందించాల్సి ఉండగా, పరిస్థితుల కారణంగా ట్యాంకర్లపై ఆధారపడాల్సి రావడం రైతుల దుస్థితికి అద్దం పడుతోంది. ఎనిమిది ఎకరాల పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటిని పారించడం రైతుకు అదనపు ఆర్థిక భారంగా మారే అవకాశం ఉంది.

రైతుల కష్టాలు పట్టించుకునేదెవరు

పంటలు చేతికి వచ్చే కీలక సమయంలో నీరు, విద్యుత్ అందకపోతే పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగునీటి సమస్యలను పరిష్కరించి, విద్యుత్ సరఫరాను మెరుగుపరిచి పంటలను కాపాడేందుకు అధికారులు, ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

రైతులకు సాగునీరు అందించాల్సిన సమయంలో ట్యాంకర్లతో నీటిని పారించాల్సిన దుస్థితి ఏర్పడటం వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలను మరోసారి వెలుగులోకి తెస్తోంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.