Monday, October 19, 2026
Homeతెలంగాణజిల్లా కాంగ్రెస్ పార్టీ వాణిజ్య సెల్ అధ్యక్షుడిగా తాటిపల్లి రాజన్నను నియమించారు

జిల్లా కాంగ్రెస్ పార్టీ వాణిజ్య సెల్ అధ్యక్షుడిగా తాటిపల్లి రాజన్నను నియమించారు

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వాణిజ్య సెల్ అధ్యక్షుడిగా తాటిపల్లి రాజన్న నియామకం…

నియామక పత్రాన్ని అందజేసిన హుజురాబాద్ ఇంచార్జి వొడితల ప్రణవ్..నమ్మకాన్ని నిలబెట్టుకుంటా,ఎన్నికకు కృషి చేసిన పార్టీ నాయకత్వానికి,ఇంచార్జి ప్రణవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు..

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వాణిజ్య సెల్ అధ్యక్షుడిగా తాటిపల్లి రాజన్నను నియమిస్తూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు నియామక పత్రాన్ని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆయనకు అందజేశారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ పార్టీ నమ్ముకున్న వారికి సముచిత స్థానం కల్పిస్తామని,జిల్లాలో ఉన్న వ్యాపార,వాణిజ్య సముదాయాలను సమన్వయం చేస్తూ,వారి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని రాజన్నను కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాపారస్థులకు,వాణిజ్య సముదాయాలకు అండగా ఉంటుందని,ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.అనంతరం రాజన్న మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఇంతటి బాధ్యత అప్పగించిన మంత్రులకు,జిల్లా పార్టీ నాయకత్వానికి, హుజురాబాద్ ఇంచార్జి ప్రణవ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యాపార,వాణిజ్య సముదాయాల నాయకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.