Monday, October 19, 2026
Homeతెలంగాణమహిళల ఆదరణతో ‘స్త్రీశక్తి’ పథకం చారిత్రాత్మక మైలురాయి

మహిళల ఆదరణతో ‘స్త్రీశక్తి’ పథకం చారిత్రాత్మక మైలురాయి

📰 Generate e-Paper Clip

100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు పూర్తి.. మహిళలకు రూ.3,550 కోట్ల ఆదా

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలకు ప్రయోజనం విద్యార్థినులు, ఉద్యోగినులు, ఉపాధి కోసం వెళ్లే మహిళలకు ఆర్థిక భరోసా

తెలంగాణ: మహిళల ఆదరణ, మాతృమూర్తుల ఆమోదంతో ‘స్త్రీశక్తి’ పథకం చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 100 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు పూర్తయ్యాయి. ఈ విజయంపై పథకం నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

రోజుకు 24 లక్షల మంది మహిళలకు ప్రయోజనం

స్త్రీశక్తి పథకం ద్వారా రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. విద్యనభ్యసించే విద్యార్థినుల నుంచి ఉద్యోగాలకు వెళ్లే మహిళలు, రోజువారీ ఉపాధి కోసం ప్రయాణించే ఆడబిడ్డల వరకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా మారింది. ప్రయాణ ఖర్చుల భారం తగ్గడంతో మహిళలు తమ అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం లభిస్తోంది.

రూ.3,550 కోట్ల మేర ఆదా

ఈ పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు సుమారు రూ.3,550 కోట్ల మేర ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకున్నారు. ఇలా ఆదా అవుతున్న డబ్బు మహిళల కుటుంబ అవసరాలకు, పిల్లల చదువులకు, ఇతర అత్యవసర ఖర్చులకు ఉపయోగపడే అవకాశం ఉందని పథకం నిర్వాహకులు పేర్కొన్నారు. మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందించడంతో పాటు వారి రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేయడంలో స్త్రీశక్తి కీలక పాత్ర పోషిస్తోంది.

ఆర్టీసీ సిబ్బందికి అభినందనలు

స్త్రీశక్తి పథకాన్ని ఆదరిస్తూ విజయవంతం చేస్తున్న మహిళలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు పూర్తి కావడంలో కృషి చేసిన ఆర్టీసీ యాజమాన్యం, అధికారులు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

మహిళల ప్రయాణ అవసరాలను తీర్చడంతో పాటు వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడంలో ఈ పథకం దోహదపడుతోందని పేర్కొన్నారు. మహిళల ఆదరణతో స్త్రీశక్తి పథకం మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.