Monday, October 19, 2026
Homeతెలంగాణతెలంగాణ సంస్కృతికి ప్రతీక.. ఆడబిడ్డల ఆత్మీయ వేడుక.. బతుకమ్మ పండుగ! 

తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. ఆడబిడ్డల ఆత్మీయ వేడుక.. బతుకమ్మ పండుగ! 

📰 Generate e-Paper Clip

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ

ఆడబిడ్డల ఆత్మీయ వేడుకకు శ్రీకారం.. మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ఆడబిడ్డల ఆత్మీయ వేడుకగా ప్రత్యేక గుర్తింపు పొందిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆడబిడ్డల అతిపెద్ద పండుగైన బతుకమ్మ, ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతున్న శుభ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ ముఖ్యమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

సింగిడి రంగుల పూలతో ప్రకృతి అందాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి అద్దం పడుతుందని సీఎం పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను కాపాడుతూ, ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగగా బతుకమ్మకు విశిష్ట స్థానం ఉందని తెలిపారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ మహిళలు ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపుతుందని ఆకాంక్షించారు.

బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సంతోషాలను నింపాలని, ప్రతి గుండెలో ఆనందాన్ని విరబూయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పే ఈ పూల పండుగ ప్రజల మధ్య ప్రేమాభిమానాలను, ఆత్మీయతను మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు.

గౌరమ్మ తల్లి ఆశీస్సులతో తెలంగాణ ఆడబిడ్డలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ముఖ్యమంత్రి మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మహిళలందరూ తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ పండుగను జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ అస్తిత్వాన్ని, ఆడబిడ్డల ఆత్మీయతను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ రాష్ట్రవ్యాప్తంగా పూల పరిమళాలతో, సంప్రదాయ పాటలతో పండుగ శోభను తీసుకురానుంది. ప్రకృతిని పూజిస్తూ, మహిళల ఐక్యతను చాటిచెబుతూ సాగే ఈ పూల పండుగ తెలంగాణ సంస్కృతీ వైభవాన్ని మరోసారి చాటిచెప్పనుంద.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.