తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. ఆడబిడ్డల ఆత్మీయ వేడుక.. బతుకమ్మ పండుగ!
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ ఆడబిడ్డల ఆత్మీయ వేడుకకు శ్రీకారం.. మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ఆడబిడ్డల ఆత్మీయ వేడుకగా ప్రత్యేక గుర్తింపు పొందిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆడబిడ్డల అతిపెద్ద పండుగైన బతుకమ్మ, ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతున్న శుభ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ ముఖ్యమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సింగిడి రంగుల పూలతో ప్రకృతి అందాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి...