Monday, October 19, 2026
Homeతెలంగాణఇందిరమ్మ ఇండ్ల పంపిణీ గ్రామపంచాయతీలకు అప్పగించాలి.

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ గ్రామపంచాయతీలకు అప్పగించాలి.

📰 Generate e-Paper Clip

బీసీ జేఏసి హుజురాబాద్ నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న డిమాండ్.

భీమ్ ఇండియా టుడే  హుజురాబాద్ పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ ఆవరణలో ఏర్పాటుచేసిన బీసీ జేఏసీ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు పాలక వర్గాలు ఎన్నుకొనబడిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల బాధ్యతను ఇందిరమ్మ కమిటీలకు అప్పగించడము సరియైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2024 నుండి డిసెంబర్ 2025 వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉన్నందున అప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఇందిరామ్మ కమిటీలను ఇప్పటివరకు కొనసాగించి గ్రామపంచాయతీ పాలక వర్గాల అధికారాలను నిర్వీర్యము చేయడము ఎంతవరకు సమంజసమని వారన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ బాధ్యతను గ్రామపంచాయ తీలకు అప్పగించి అసలైన నిరుపేద వర్గ ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లుమంజూరు కాబడునట్లు చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని అభిప్రాయపడి నారు. ప్రస్తుతము గ్రామ పంచాయతీల పాలకవర్గం పాలన కొనసాగుతున్నం దున స్పెషలాఫీసర్ల కాలము లో నియమించబడిన ఇందిరమ్మ కమిటీలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, పేద వర్గాల కు ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేసే బాధ్యత గ్రామపంచాయతీలకు అప్పగించి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుటలో తెలంగాణ ప్రభుత్వము తగు చర్యలు తీసుకుంటుం దనే విశ్వాసాన్ని వ్యక్తం చేసినారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు వన్నాల శివాజీ, బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, ఉపాధ్యక్షులు మామునూరు ప్రవీణ్ కుమార్, కొలిపాక క్రాంతికుమార్, బీసీ జాతీయ సంక్షేమ సంఘం హుజూరాబాద్ నియోజక వర్గం మహిళా జనరల్ సెక్రెటరీ దేవసాని ప్రియ దర్శిని, ప్రజాసంఘాల నాయకులు రామ్ సారయ్య, బండ తిరుపతి, దాట్ల ప్రభాకర్, పోగు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.