భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ స్పెషల్ స్టోరీ
ప్రతిరోజూ ఉదయం అందరికంటే ముందే ఆఫీసుకు వెళ్లేవాడు లక్ష్మి రాజాం ఆఫీసులో ఫైళ్లు సర్దడం నుంచి, అధికారులు చెప్పిన పనులు పూర్తి చేయడం వరకు తన బాధ్యతగా భావించేవాడు.
నెలాఖరు వచ్చింది. జీతం ఖాతాలో పడింది.
కానీ ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజు, కరెంట్ బిల్లు, సరుకుల ఖర్చులు… అన్నీ కలిపి చూస్తే జీతం సరిపోలేదు.
ఆ రాత్రి లక్ష్మి రాజాం కూతురు నాన్న దగ్గరకు వచ్చి అడిగింది…
నాన్నా… మీరు అందరికీ ఇంత పని చేస్తారు కదా… మీ ఉద్యోగానికి సరిపడ కనీస వేతనం ఎప్పుడు వస్తుంది?”
ఆ ప్రశ్న విన్న లక్ష్మి రాజాం కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు.
త్వరలో వస్తుంది తల్లీ…” అని చెప్పాడు.
కానీ ఆ మాట తన కూతురికి చెప్పాడా…
లేక తనను తానే ఓదార్చుకున్నాడా… అతనికే తెలియదు.
ఎందుకంటే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కూడా అదే సమయానికి పనిచేస్తాడు…
అదే బాధ్యతలు నిర్వర్తిస్తాడు…తన కుటుంబం కోసం అదే కలలు కంటాడు.
కష్టం చేసే ప్రతి ఉద్యోగికి…తన కుటుంబాన్ని గౌరవంగా నడిపించుకునేంత వేతనం ఉండాలి.ఒక ఉద్యోగి అడిగేది దానం కాదు…తన కష్టానికి తగిన న్యాయమైన వేతనం.

