Tuesday, October 20, 2026
Homeతెలంగాణసేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా స్వచ్ఛ హాస్పిటల్ కార్యక్రమం

సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా స్వచ్ఛ హాస్పిటల్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఎల్కతుర్తి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో “స్వచ్ఛ హాస్పిటల్” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను శుభ్రపరిచి, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండటం ప్రజల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

ప్రజా ఆరోగ్య పరిరక్షణతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారు:

జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లెపాటి మధుకర్, కుడితాడు చిరంజీవి.మండల ప్రధాన కార్యదర్శులు అల్లి కుమార్, చిదురాల వెంకటేష్, కంచర్ల శంకరయ్య, ముషీకే వెంకటేష్, జనగాని కిష్టయ్య, ఆడెపు శ్రీ వర్ధన్, రగోతం రెడ్డి, నాంపల్లి మమత అశోక్, కోడం రమేష్, గణేష్ శ్రీనివాస్, ఠాకూర్ శ్యామ్ సింగ్, కొమ్మ నిరంజన్ రెడ్డి, రవీందర్

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.