సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా స్వచ్ఛ హాస్పిటల్ కార్యక్రమం
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఎల్కతుర్తి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో “స్వచ్ఛ హాస్పిటల్” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను శుభ్రపరిచి, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండటం ప్రజల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజా ఆరోగ్య...