Tuesday, October 20, 2026
Homeతెలంగాణసీఎం రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం

సీఎం రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం

📰 Generate e-Paper Clip

సిరిసిల్ల సీఎం సభను విజయవంతం చేయడానికి దండేపల్లి నుంచి భారీ జనసమీకరణ

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో  సీఎం సభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. దండేపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన జాజాల మొగిలి ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిర్వహించనున్న సీఎం సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలను తరలించేందుకు సన్నాహాలు చేపట్టారు.

ఈ సందర్భంగా జాజాల మొగిలి మాట్లాడుతూ.. సీఎం సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా దండేపల్లి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ఉన్న ఉత్సాహాన్ని సభలో చాటిచెప్పేలా భారీ జనసమీకరణతో కరీంనగర్ సభను విజయవంతం చేస్తామని తెలిపారు.

సీఎం రాక నేపథ్యంలో గ్రామంలోని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోందని, పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ సభకు తరలిరావడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని జాజాల మొగిలి పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.