Tuesday, October 20, 2026
Homeతెలంగాణనవంబర్ 19న ‘ఇందిరమ్మ బీమా’ ప్రారంభం

నవంబర్ 19న ‘ఇందిరమ్మ బీమా’ ప్రారంభం

📰 Generate e-Paper Clip

అర్హులైన పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా రక్షణ

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్  రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని నవంబర్ 19న ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

ఈ పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించిన సందర్భంలో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా బీమా పథకం ద్వారా భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

పేద కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పథకం అమలుతో అర్హత కలిగిన కుటుంబాలకు భవిష్యత్తులో ఆర్థిక రక్షణ లభించనుంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.