నవంబర్ 19న ‘ఇందిరమ్మ బీమా’ ప్రారంభం

అర్హులైన పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా రక్షణ భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్  రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని నవంబర్ 19న ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించిన సందర్భంలో ఆ...