Tuesday, October 20, 2026
Homeతెలంగాణకొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి ఉత్సవాలను

కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి ఉత్సవాలను

📰 Generate e-Paper Clip

ఘనంగా నిర్వహించిన హుజురాబాద్ పద్మశాలి సంఘం నాయకులు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి హుజురాబాద్ పద్మశాలి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలోని హనుమకొండ రోడ్డులో గల కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో ఘనంగా నిర్వహించినారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న పద్మశాలి సంగం నాయకుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఆత్మ గౌరవం ప్రతీక తెలంగాణ ఉద్యమ పితామహుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి ముద్దుబిడ్డగా జన్మించడం పద్మశాలి కుల బాంధవులందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు సామాన్య కుటుంబంలో జన్మించి అసమాన్యునిగా ఎదిగినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ సామాన్యులకు న్యాయం చేయాలనే ఆశయంతో న్యాయవాద వృత్తిని చేపట్టి నిజాం నిరంకుశ రజాకర్ల పాలన వ్యతిరేక ఉద్యమంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులకు న్యాయపరంగా అండగా నిలిచిన మహానుభావుడు తెలంగాణ ప్రజలందరికీ ఆదర్శ పురుషుడని అభిప్రాయపడినారు చేనేత సహకార రంగాలకు తగినటువంటి న్యాయము అందుట కొరకై చేనేత సహకార ఉద్యమాన్ని నడిపి చేయూతనందించినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ మనందరికీ గర్వకారణమని తెలియజేసినారు 1969 వ సంవత్సరం తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమికను పోషించడమే కాకుండా ప్రత్యేక తెలంగాణ కొరకు తన మంత్రి పదవిని త్యాగము చేసిన త్యాగమూర్తి కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి బిడ్డగా జన్మించడం మన అందరి అదృష్టం అన్నారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో 97వ సంవత్సరంలో కురువృద్ధుడైనప్పటికీ లెక్క చేయకుండా తెలంగాణ సహకారం కొరకు ఆమరణ దీక్ష నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ మన అందరి గుండెలలో అమరుడు గా ఎల్లప్పుడూ నిలుస్తాడని అతని ఆశయాలను ఆదర్శంగా తీసుకొని పద్మశాలి బిడ్డలందరూ ముందుకు సాగాలని ఆకాంక్షించినారు ఈ కార్యక్రమంలో వేముల యాదగిరి విడప రాజు మంద రమేష్ చిలుక మారి శ్రీనివాస్ సబ్బని రాజేందర్ కుడికాల భాస్కర్ సంగెం భాస్కర్ కొండా గణేష్ మండల యాదగిరి కుడికాల సాయి ఇ ప్పనపల్లి చంద్రశేఖర్ ఆడెపు సూర్యం మంద బిక్షపతి మండల సేకరయ్య గంజి జయవర్ధన్ సంగం భాస్కర్ సంగం ఐలయ్య సంగం శ్రీనివాస్ చిక్స్ సంఘం శ్రీనివాస్ మెడికల్ కడవెరుగు సత్యం గాలి సమ్మయ్య పద్మశాలి కుల బాంధవులు పాల్గొని విజయవంతం చేశారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.