Monday, October 19, 2026
Homeతెలంగాణప్రమాదం చెప్పిరాదు.. అప్రమత్తతే రక్షణ!

ప్రమాదం చెప్పిరాదు.. అప్రమత్తతే రక్షణ!

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి, అందరికీ నమస్కారం

తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు, గాలులు.. విద్యుత్‌ ప్రమాదాలపై ప్రజలకు కేతిరి లక్ష్మారెడ్డి సూచనలు
భీమ్ ఇండియా టుడే న్యూస్ భీమదేవరపల్లి: తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భీమదేవరపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కేతిరి లక్ష్మారెడ్డి సూచించారు. ప్రజలే ముఖ్యమనే ఉద్దేశంతో విద్యుత్‌ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు, బలమైన గాలులు వీచే సమయంలో విద్యుత్‌ స్తంభాలు, వైర్లు, విద్యుత్‌ పరికరాల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని భీమదేవరపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షులు కేతిరి లక్ష్మారెడ్డి  తెలిపారు.

విద్యుత్‌ ప్రమాదాల నివారణకు సూచనలు.   

1.తడిసిన విద్యుత్‌ స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు.

2.తడి చేతులతో స్టార్టర్లు, మోటార్లు ముట్టుకోరాదు.

3.విద్యుత్‌ లైన్లకు ఆనుకున్న చెట్లను ముట్టుకోరాదు.

4.విద్యుత్‌ లైన్లకు చెట్టు కొమ్మలు తగిలితే వెంటనే సంబంధిత లైన్‌మన్‌ లేదా విద్యుత్‌ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి.

5.పార్కులు, స్టేడియంలలోని విద్యుత్‌ స్తంభాలను ముట్టుకోకూడదు.

6.ఇంట్లోని స్విచ్‌ బోర్డులను తడి చేతులతో తాకరాదు.

7.బయట ఏర్పాటు చేసిన విద్యుత్‌ లైట్లు నీటికి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

8.విద్యుత్‌కు సంబంధించిన పరికరాలను తడి చేతులతో ముట్టుకోరాదు.

9.చిన్న పిల్లలను విద్యుత్‌ పరికరాలు, వైర్లకు దూరంగా ఉంచాలి.

10.ఇళ్లలో ఉతికిన బట్టలను విద్యుత్‌ తీగలపై ఆరబెట్టకూడదు.

11.గాలి, వర్షం, దుమారం కారణంగా తెగిపడిన విద్యుత్‌ వైర్లను ముట్టుకోకూడదు.

12.వాటర్‌ హీటర్‌ ఉపయోగించే ముందు స్విచ్‌ ఆఫ్‌ చేసి, ప్లగ్‌ను తొలగించిన తర్వాతే సంబంధిత వస్తువును ముట్టుకోవాలి.

13.ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సమయంలో డిష్‌ కనెక్షన్‌ను తొలగించడం మంచిది.

14.వర్షం పడుతున్న సమయంలో టీవీ, ఫ్రిజ్‌, కంప్యూటర్‌ వంటి విద్యుత్‌ పరికరాల స్విచ్‌లను ఆఫ్‌ చేయాలి.

15.ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే సమయంలో విద్యుత్‌ లైన్ల సమీపంలో సెల్‌ఫోన్‌ ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలి.

16.ఇంటికి వచ్చే సర్వీస్‌ వైర్‌ దెబ్బతిన్నా, తెగిపోయినా వెంటనే సంబంధిత JLM, ALM, LM, LI, సబ్‌స్టేషన్‌ లేదా AEలకు సమాచారం ఇవ్వాలి. అవసరమైతే 1912కు ఫిర్యాదు చేయాలి.

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి విద్యుత్‌ ప్రమాదాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేతిరి లక్ష్మారెడ్డి కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.