Monday, October 19, 2026
Homeఆంధ్ర ప్రదేశ్ఎమ్మెల్యే గారు పరిశీలించి పార్కు స్థలాన్ని శుభ్రపరిచి మొక్కలు నాటారు.

ఎమ్మెల్యే గారు పరిశీలించి పార్కు స్థలాన్ని శుభ్రపరిచి మొక్కలు నాటారు.

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ తిరుపతి:25 ఏళ్లుగా నిరుపయోగంగా 1వ వార్డు రిజిస్ట్రేషన్ కాలనీ పార్కు – అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినా పట్టించుకోని అధికారులు – AAP ఆగ్రహం*

తిరుపతి ఒకటో వార్డు రిజిస్ట్రేషన్ కాలనీ నందు గల పార్కు స్థలం గత 32 సంవత్సరాలుగా నిరుపయోగంగా వృధాగా ఉంది. పలు దఫాలుగా స్థానిక ప్రజలు మరియు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున వినతి పత్రాలు సమర్పించడంతో గత సంవత్సరం మున్సిపల్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే గారు పరిశీలించి పార్కు స్థలాన్ని శుభ్రపరిచి మొక్కలు నాటారు.

అయితే సంవత్సరం గడుస్తున్నా ఒక్క మొక్క కూడా బతికి లేదు.* నీరు పోయక, సంరక్షణ లేక అన్ని మొక్కలు చనిపోయాయి. ప్రస్తుతం ఆ పార్కు స్థలం పూర్తిగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. బహిరంగ మద్యపానం, మందుబాబుల ఆగడాలు, గొడవలతో స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కావున అధికారులు తక్షణమే స్పందించి:

1. పార్క్ ప్రధాన గేటు మరమ్మత్తులు చేపట్టాలి 

2. వాకింగ్ ట్రాక్, బెంచీలు, లైట్లు, పిల్లల ఆట వస్తువులు ఏర్పాటు చేయాలి.

3. పచ్చదనంతో అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగకరంగా చేయాలి.

లేని పక్షంలో స్థానిక ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాము.

పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *కల్లూరు బాలసుబ్రహ్మణ్యం, తిరుపతి జిల్లా అధ్యక్షులు *నీరుగట్టు నగేష్*, రాష్ట్ర ఉపాధ్యక్షులు *వెంకటాచలపతి*, తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ *బొంతల రాజేష్ రాయల్* తదితరులు పాల్గొని డిమాండ్ చేశారు.నీరుగట్టు నగేష్ తిరుపతి జిల్లా అధ్యక్షులు, AAP 9492820119

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.