Thursday, September 10, 2026
Homeతెలంగాణస్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్...

స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ తీవ్రంగా ఖండించారు.

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఖమ్మం స్పీకర్‌పై తాతా మధు అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం: ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్

తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ తీవ్రంగా ఖండించారు

స్పీకర్‌ పదవి ఏ ఒక్క పార్టీకి, వ్యక్తికి సంబంధించినది కాదని.. అది శాసనసభ గౌరవానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనన్నారు.

రాజకీయంగా విభేదాలు ఉండొచ్చని.. కానీ రాజ్యాంగబద్ధమైన పదవుల గౌరవాన్ని కించపరిచేలా వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేశారు.

స్పీకర్‌ను అవమానించడం అంటే శాసనసభ గౌరవాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమే” అని ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అన్నారు.

తాతా మధు తన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.