Friday, September 11, 2026
Homeఆంధ్ర ప్రదేశ్శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే.ఆంధ్రప్రదేశ్ ఏలూరు, సెప్టెంబర్ 05: ప్రజల మధ్య కృష్ణాష్టమి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. శనివారం ఏలూరు పార్లమెంట్ పరిధిలోని నూజివీడు, పెదపాడు, మండవల్లిలలో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. మంత్రి పార్థసారథితో కలిసి ఉదయం ముందుగా నూజివీడు మండలం పాతరావిచెర్ల గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ దేవర తల్లి గుడి ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం పాతరావిచెర్ల  గ్రామంలోనూ, పెదపాడు మండలం ఏపూరు గ్రామంలోనూ జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ, వేడుకల్లో పాల్గొన్న ప్రజలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తనకు శ్రీకృష్ణాష్టమి అంటే ఇష్టమని, ఈసారి ఇక్కడ గ్రామస్థులతో కలిసి  శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత రెండు సంవత్సరాలనుంచి ఏలూరు పార్లమెంట్ ప్రజల మధ్యే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నట్లు ఎంపీ గుర్తు చేసారు. సాయంత్రం కైకలూరు నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మండవల్లిలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలలో ఎంపీతో పాటు నూజివీడు, పెదపాడు, మండవల్లి మండలాలకు చెందిన టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.