Saturday, September 12, 2026
Homeతెలంగాణకాంగ్రెస్ పార్టీ నాయకులపై పెట్టిన శ్రద్ధలో సగం ప్రజలపై పెడితే బాగుంటుంది

కాంగ్రెస్ పార్టీ నాయకులపై పెట్టిన శ్రద్ధలో సగం ప్రజలపై పెడితే బాగుంటుంది

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఈరోజు తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కడి శివ చరణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భారతదేశ ప్రతిపక్ష నేత మా ప్రియతమ నాయకులు గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు పై అక్రమంగా నమోదు చేసిన F.I.R ను వెంటనే వెనక్కి తీసుకోవాలని భూపాలపల్లి యూత్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో BJP పార్టీ కార్యాలయాన్ని ముట్టడికి యత్నించడం జరిగింది

అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేయడం జరిగింది.                                       కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై BJP అనునిత్యం ఇలా అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను ఇబ్బంది పెట్టాలని ప్రత్యేకంగా ప్రణాళికలు రచిస్తుందని వారు అన్నారు  కాంగ్రెస్ పార్టీ నాయకులపై పెట్టిన శ్రద్ధలో సగం ప్రజలపై పెడితే బాగుంటుందని వారు విమర్శించారు

 ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిపై జరిగిన అవమానాన్ని కూడా వారు తీవ్రంగా ఖండించారు

బిజెపి ప్రభుత్వానికి ఇక అంతమే మిగిలిందని దానికి నిదర్శనం బిజెపి చేస్తున్న దొంగ పనులే కారణమని, వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెతను BJP నాయకులు* *గుర్తుంచుకోవాలని వారు స్పష్టం చేశారు

దేశంలో నిరుద్యోగం, పేదరికం, నిత్యం పెరుగుతూ ఉన్న అనేక సమస్యలు ఉన్న కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడమే బిజెపి ప్రభుత్వం పనిగా పెట్టుకోవడం సిగ్గుచేటు అని వారు అన్నారు

మీరు ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టిన ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని వారు స్పష్టం చేశారు

2029 లో రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా కాకుండా ఆపడం ఎవరి తరం కాదు అని వారు అన్నారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలు బిజెపి ఇకనైనా మానుకుంటే మంచిదని వారు హితవు పలికారు*లేనిపక్షంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బిజెపి నేతల ఇళ్లను కూడా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముట్టడి చేస్తామని వారు హెచ్చరించారు*ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు నమునూరి రజినీకాంత్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోసిక సాయి చరణ్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్ కొలుగూరి అనిల్,నీలా రాజు యువజన కాంగ్రెస్ నాయకులు పున్నం ప్రవీణ్,కాట్రేవుల నవీన్,కీర్తి రాజు, మేకల శివ,కట్ల మహేష్,చిరంజీవి, బోయిని తిరుపతి,ముద్దమల్ల నరేష్, కొమ్మరాజు భాస్కర్,పేరాల రాజేందర్,వెన్నెం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.