Monday, September 14, 2026
HomeEditorialకాలేజీ లను పట్టుదలతో మంజూరు చేసుకున్నాం.

కాలేజీ లను పట్టుదలతో మంజూరు చేసుకున్నాం.

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా *హుస్నాబాద్ ఉమ్మాపూర్ లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల బాలుర ,బాలికల హాస్టల్స్ నూతన భవనాలకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక్కో హాస్టల్ కి 7.28 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 14.56 కోట్ల రూపాయల వ్యయంతో హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ బాలుర & బాలికల హాస్టల్ కి శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ .కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వీసీ ఉమేష్ కుమార్ , రిజిస్టార్ , ప్రిన్సిపల్ , క్లన్సిలర్ లు , మార్కెట్ కమిటీ చైర్మన్ లు , సర్పంచ్ లు 

మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ పాఠశాల 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హుస్నాబాద్ కి ఏదైనా యూనివర్సిటీ వస్తె బాగుండు అనే మాట వ్యక్తం చేశారు.. అప్పుడు వెంటనే హుస్నాబాద్ కి ఇంజినీరింగ్ కాలేజీ కావాలని ప్రతిపాదనలు చేశాం పెద్దపల్లి కీ ముఖ్యమంత్రి  వచ్చినప్పుడు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ కి ఎల్ఎల్బి , ఎల్ఎల్ఎం, ఫార్మసీ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ అడగగానే ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నామని ప్రకటించారు.

ముఖ్యమంత్రి  ప్రకటించిన కాలేజీ లను పట్టుదలతో మంజూరు చేసుకున్నాం..కేబినెట్ లో ఇంజనీరింగ్ కాలేజీ అప్రూవల్ చేసుకొని, స్థలం అప్రూవల్ చేసుకొని భవనాలకు నిధులు మంజూరు చేసుకున్నాం..ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశాల భవనాలకు శంకుస్థాపన చేసుకున్నాం..ఇప్పుడు హాస్టల్ భవనాలకు శంకుస్థాపన చేసుకున్నాం మొదటి సంవత్సరంలో 240 మంది విద్యార్థులకు 60 మంది చేరితే సైకిళ్లు ,ల్యాప్ టాప్స్ అందించాం.. మంచి నాణ్యమైన విద్య ప్రమాణాలు అందించడం కోసం రాజకీయ జోక్యం లేకుండా చూసుకున్నాం ఇప్పుడు సెకండ్ ఇయర్స్ లో 120 మంది చేరారు.ఐటీ లో జీరో ఉంటే 175 కి చేరింది..మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్స్ లు తీసుకొస్తాం..వచ్చే విద్యా సంవత్సరం లోపు స్త్రెంత్ ఫుల్ అవుతుంది..ఇప్పటికే విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తున్నాం..ఈరోజు భవనాలకు శంకుస్థాపన చేసుకున్నాం కాలేజీ హాస్టల్ లోనే లైబ్రరీ పెట్టిస్తాం..విద్యార్థులు బాగా చదువుకోవాలి మీకు ఏ సమస్య ఉన్నా స్థానిక ఎమ్మెల్యే గా కాకుండా మీకు గార్డియన్ గా ఉంటా..త్వరలో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల కు రెండు బస్సులు రాబోతున్నాయి ఎవరైనా దాన గుణం ఉన్నవారు విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వడం..బస్ వచ్చే వరకు ఇంకా ఏదైనా రవాణా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్న                       కోహెడ తంగలపల్లి లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలు వేగంగా నిర్మిస్తున్నాం..

సైదాపూర్ లో మరో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రాబోతుంది..ఇప్పటికే ATC కి శంకుస్థాపన చేసుకున్నాం..

భీమదేవరపల్లి మండలంలో నవోదయ స్కూల్ రాబోతుంది

చిగురు మామిడి లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాబోతుంది..

ఎల్కతుర్తి బాసర ట్రిపుల్ ఐటీ బ్రాంచ్ రాబోతుంది..

హుస్నాబాద్ కబడ్డీ అకాడమీ వస్తుంది.. మంచి స్పోర్ట్స్ స్టేడియం నిర్మిస్తాం..

పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తున్నాం.. పక్కనే అర్బన్ ఫారెస్ట్ పార్క్..ఎల్లమ్మ చెరువు బ్యూటిఫికేషన్ చేస్తున్నాం..

మీరు మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి.. మౌలిక సదుపాయాలు నేను కల్పిస్త..విద్యా బోధనలో అకడమిక్ సైడ్ లో చిన్న లోటు ఉన్న వైస్ చాన్సలర్ బాధ్యత..మీకు ఏ సమస్య ఉన్న ఎడ్యుకేషన్ గార్డియన్ ఆయన దృష్టికి తీసుకుపోండి మంచి మార్కులు సాధించాలి..అందరూ ఉన్నత స్థాయికి చేరుకోవాలి భవన నిర్మాణాలు ఏడాది లోపు పూర్తి చేస్తామని వాళ్లు హామీ ఇచ్చారు..

నియోజకవర్గంకి ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తాం..ఎల్లమ్మ చెరువు గ్లాస్ బ్రిడ్జి విసృత ప్రచారం కావడం వల్ల విజిటర్స్ చాలా మంది వస్తున్నారు..పందిళ్ల నుండి ఎల్లమ్మ చెరువు ..మల్లె చెట్టు చౌరస్తా నుండి ఎల్లమ్మ చెరువు వైపు రోడ్డు నిర్మిస్తాం..విద్యా ,వైద్యం ,వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నాం..నేను విద్యార్థి నాయకుడిని కాబట్టి ఇక్కడికి ఇంజనీరింగ్ కళాశాల వచ్చింది..మీరు ఇక్కడి నుండి జాబ్ తోనే బయటకు పోవాలి ఇంజినీరింగ్ కాలేజీ కి అప్రోచ్ రోడ్డు వేస్తున్నాం.. ఆటోమేటిక్ గా స్ట్రీట్ లైట్స్ వస్తాయి..    పోతారం నుండి ఇక్కడికి నాగారం మీదుగా కూడా స్ట్రీట్ లైట్స్ వేస్తున్నాం..

హుస్నాబాద్ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు ఇక్కడే చదువుకోవాలి.. రేపటి భవిష్యత్ లో మంచి ప్లేస్ మెంట్ వస్తాయి..ఉద్యోగ అవకాశాలు వస్తాయి..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.