Wednesday, September 16, 2026
Homeతెలంగాణమాల*చలో *సెక్రటేరియట్*ముట్టడి*కార్యక్రమాన్ని

మాల*చలో *సెక్రటేరియట్*ముట్టడి*కార్యక్రమాన్ని

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్  కామారెడ్డి *మాల*చలో* *సెక్రటేరియట్* *ముట్టడి* *కార్యక్రమాన్ని* *విజయవంతం* *చేయండి* 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రోస్టర్ పాయింట్ ల వల్ల మాల విద్యార్థులకు, నిరుద్యోగులకు, తీవ్ర అన్యాయం జరుగుతుందని ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ మాల మహానాడు ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు కంకణాల రమేష్, మరియు మాల కోఆర్డినేషన్ జిల్లా కన్వీనర్ బత్తుల ధర్మపురి, కో కన్వీనర్ పూల రవీందర్, దళితరత్న అవార్డు గ్రహీత పెరుమండ్ల రాజనర్సింహులు, జిల్లా నాయకులు సుతారి సుధాకర్, గోనుగుప్పుల లింగం, కంకణాల జగన్, తదితరులు పాల్గొని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపుమేరకు ఆగస్టు 31 తారీఖున జరిగే సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లాలోని మాలలు, మాల ఉపకులాలు, విద్యార్థులు, నిరుద్యోగులు, అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కంకణాల రమేష్ మాట్లాడుతూ రోస్టర్ పాయింట్ల వల్ల మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని అందరూ కలిసికట్టుగా ఒక ఉద్యమం లాగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్ని ముందస్తు అరెస్టులు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాలలంటే ఏమిటో సత్తా చూపించవలసిన సమయము ఆసన్నమైంది. కాబట్టి ఇకనైనా ప్రతి గ్రామాల్లోని, మండల, జిల్లా, రాష్ట్ర నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు, అలాగే బత్తుల ధర్మపురి మాట్లాడుతూ విద్య, ఉద్యోగాలలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు, ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాజనర్సింహులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు మాల సంఘాలన్నీ ఏకతాటి పైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చాడు, అలాగే సుతారి సుధాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రోస్టర్ పాయింట్లను తొలగించి మాలలకు, మాల ఉపకులాలకు న్యాయం చేయాలని కోరారు, న్యాయం చేయలేని పక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని హెచ్చరించారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.