భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ వధూవరుల తల్లితండ్రులకు మనవి. వివాహ వయస్సు*స్త్రీకి 18-25
పురుషునికి 23-27 దాటి ,30…. ,35…. ,40…. సంవత్సరాలు వచ్చినా వివాహం చెయ్యని యువతీ యువకుల తల్లిదండ్రులకు మనవి.
అయ్యా,అమ్మా మనం మన పిల్లలకు 35, 40 ఏళ్ళు వచ్చినా కూడా
సాఫ్ట్ వేర్ ఉద్యోగం లక్షల్లో జీతాలు కోట్ల ఆస్తి
లేదని మరియు ఉమ్మడి కుటుంబమని, వ్యాపారస్తుడని, తల్లిదండ్రులు పాతసామాన్లని, అన్నదమ్ములు పనికిమాలినవారని, అక్కా చెల్లెళ్లు ముష్టివాళ్ళని.
అనేక కారణాలతో, మన అర్హతనుబట్టి కాకుండా మాకే అమ్మాయి ఉంది మేమే చాలా గొప్ప వాళ్ళం అని అత్యాశకు పోయి మంచి సంబంధాలు వచ్చినా పెళ్లిచేయ్యకుండా,
మనం మాత్రం మన అమ్మాయిలు/అబ్బాయిలు కష్టపడి సంపాదించిన లక్షలాది జీతాలతో ఇల్లు కొనుక్కొని AC రూంలో రకరకాలుగా భోగాలనుభవిస్తూ మన పిల్లలకు కుంటి సాకులు చెబుతూ త్రిశంకు స్వర్గాన్ని చూపిస్తున్నాం.
చాలా మంది తల్లిదండ్రులు మంచి సంబంధమైనా జాతకాలు బాగాలేదని లేదా
ఏదో వంకతో సంబంధాలు తామే చెడగొడుతున్నారు.
తల్లిదండ్రులు,* *అన్నదమ్ములు,అక్కా చెల్లెళ్ళు లేకుండా అనాధలకు ఇస్తారా పిల్లలను
కోటీశ్వరులు ఎక్కడో……. ఉంటారు
అది వంశ పరంపరగానో లేక,
పెద్దగా వ్యాపారం చేసో లేక,
ఎదో అదృష్టం కలిసొచ్చో అయి ఉంటారు.
మిగిలిన వారు పెళ్లికి అనర్హులేనా
ఎవరూ ఉండకూడ దంటే ఎలా
చాలామంది అమ్మాయిలు/అబ్బాయిలు ఇలా ఘోషిస్తున్నారు.
మీకు పెళ్ళిచేసి పంపిస్తే….
మేం ఎలా బ్రతికేది… అని మా అమ్మా నాన్నలే మాకు వచ్చే మంచి సంబంధాలు చెడగొడుతున్నారు, అని అమ్మాయిలు/అబ్బాయిలు భోరున ఏడ్చి చెప్పిన సన్నివేశాలు చాలా చూస్తున్నాం!
పెళ్లి చెయ్యడం మన బాధ్యత.. దేవుడు మనకు కాళ్ళు చేతులు ఇచ్చాడు కదా మనం కస్టపడి జీవిస్తేనే మనకు గౌరవం అని ఆఖరి టైంలో మన కూతురు – అల్లుడు / కొడుకు – కోడలు చూస్తే చూస్తారులే అని అనుకొని గర్వంగా జీవించేలా ప్రణాళిక చేసుకోవాలి..
గుర్తుంచుకోండి.
పిల్లల పెళ్లిళ్లకు నవ గ్రహాలు అడ్డుపడడం లేదు
తల్లిదండ్రులుగా మనమే అడ్డు పడుతున్నాం
కోటీశ్వరులు అని అనుకుంటున్నారు.,
వాళ్లకు (అబ్బాయి తరుపున గాని/అమ్మాయి తరుపున గాని ఎన్ని బ్యాంకులలో అప్పులు ఉన్నాయో,బంగారం మీద ఎంత అప్పు ఉందో,
చిట్ఫండ్ కంపెనీల్లో ఎన్ని చిట్స్ ఉన్నాయో, ఇల్లు/కారు *వాయిదాలు ఎన్ని ఉన్నాయో* ఆ వివరాలు తెలుసుకోండి.* *అప్పుడు Clarity వస్తుంది అబ్బాయిల సంపద మీద.
కోట్లాది రూపాయల దొంగ వ్యాపారులు, లంచగొండ్లు, నేరస్తులు, దొంగల వద్ద ఉంటాయి కోట్లు. వాళ్లకు మీ అమ్మాయి/ అబ్బాయిని ఇస్తారా?*
35-40 సం లు వచ్చినా కోటీశ్వరుడు/కోటేశ్వరాలు రాలేదని పెళ్లి చేయకుండా ఉంటే వాళ్లకు పిల్లలు ఎప్పుడు పుడతారు? ఎపుడు సంసారం చేస్తారు? 35,40 దాటాక సరదాలు తీరతాయా!
ఇప్పటికే చాలామంది అబ్బాయిలు ఇలాంటి తల్లి దండ్రుల వల్ల వర్ణాంతర వివాహాలు చేసుకుంటున్నారు. వర్ణ సంకరానికి కారణం మీరే, ఆ పుణ్యం కూడా మీదే.
అబ్బాయిలు కూడా వాళ్ళ అత్యాశ, కోరికలు వదలి తమ అందానికి, అర్హతకు తగిన అమ్మాయిని చేసుకోవాలి.
పెళ్ళి అయిన తరువాత* *అబ్బాయి/అమ్మాయి తల్లి దండ్రులు, ముఖ్యంగా వాళ్ల వాళ్ల కోరిక మేరకు నడుచు కోవాలి… వాళ్ల సంసార జీవితంలో, వాళ్ల అభిరుచులలో అడ్డు పుల్లలు వేయకుండా ఉండాలి. కొంత మంది అబ్బాయి తరుపు తల్లితండ్రులు వాళ్ల అబ్బాయి* *వాళ్ల ఆధీనంలోనే ఉండాలని కోరుకుంటారు మరియు వాళ్ల అబ్బాయికొచ్చే సంపాదన మీద అజమాయిషీ
చేస్తారు… అదే తప్పు !! అక్కడే వాళ్ల మధ్య గొడవలకు కారణం ఔతారు… ఆ గొడవల్లో అమ్మాయి తరుపున* *వారు* *కూడా* *కలవటం వల్ల వారి చేతులారా వాళ్ల పిల్లల జీవితాలు పాడుచేసుకొంటారు
భర్త /భార్య చనిపోయిన అమ్మాయిలు/అబ్బాయిలు, విడాకులు తీసుకున్న అమ్మాయిలకు/అబ్బాయిలకు కూడా పెళ్లికాని అమ్మాయిలు/అబ్బాయిలు కంటే ఎక్కువ కోరికలు కోరుతున్నారు. ఇదొక దౌర్భాగ్యం.
ఇప్పటికైనా మనం కళ్ళు తెరచి మంచి వాడు, గుణవంతుడు, కష్టపడే వాడు, సాంప్రదాయ కుటుంబంలోని అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి పెళ్ళిచేసి వాళ్ళ సంతోషాన్ని చూసి ధన్యత పొందుదాం
అలాగే *గుణవంతురాలు, సాంప్రదాయ కుటుంబంలోని అమ్మాయికి* *మీ అబ్బాయినిచ్చి పెళ్ళి చేసి వాళ్ళ సంతోషాన్ని చూసి* *ధన్యత పొందుదాం.
లేదు మేము మారం అని అనుకొంటే భగవంతుడా మాకు, మా అమ్మాయిలకు/అబ్బాయిలకు ఈ భూలోకంలో తగిన వరుణ్ణి/వదువును నీవు పొరపాటున సృష్టించటం మరచివుంటావు, మరుజన్మలోనైనా మాకోరికలకు తగిన వరుడిని / వదువును సృష్టించు అని ప్రార్ధిద్దాం!.*మంచి తల్లి తండ్రులకు.. భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్

