Friday, August 28, 2026
HomeEditorialఎంపీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

📰 Generate e-Paper Clip

ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

భీమ్ ఇండియా టుడే న్యూస్ ‎ఏలూరు, ఆగస్టు 15: 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంలో  ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం ఏలూరు శాంతి నగర్ లోని ఎంపీ క్యాంపు కార్యాలయానికి వచ్చిన వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్ధులు, స్థానిక నాయకులు, ఎంపీ కార్యాలయ సిబ్బంది ఆనందోత్సాహాల మధ్య త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు మహాత్మా గాంధీ, నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి ఎంతోమంది నేతలు చేసిన పోరాటాలు, త్యాగాలను కొనియాడారు. అనేక త్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ దేశ పురోగతికి అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత 79 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ది సాధిస్తూ నేడు ప్రపంచంలోనే అగ్ర దేశాల్లో ఒకటిగా నిలవటం భారతీయులందరికీ గర్వకారణం అన్నారు.  ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక నేతలు, ఎంపీ కార్యాలయ సిబ్బంది మహాత్మా గాంధీ, నెహ్రూ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.