ఆగస్టులో దివ్యాంగుల కోసం UDID ప్రత్యేక వైద్య శిబిరాలు సిద్దిపేట జిల్లా అధికారుల ప్రకటన
భీమ్ ఇండియా టుడే న్యూస్ .సిద్దిపేట జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దివ్యాంగుల కోసం UDID (Unique Disability ID) ప్రత్యేక వైద్య శిబిరాలను ఆగస్టు నెలలో నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రకటించారు.
దివ్యాంగులు తమ వైకల్య ధ్రువీకరణతో పాటు UDID కార్డు పొందేందుకు ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వైకల్యానికి అనుగుణంగా నిర్ణయించిన తేదీల్లో ఉదయం 9.00 గంటలకు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి హాజరుకావాలని సూచించారు.
శిబిరాల తేదీలు:
లోకోమోటర్ (శారీరక వైకల్యం):ఆగస్టు 13 మరియు 27
వినికిడి లోపం: ఆగస్టు 20
మానసిక అనారోగ్యం: ఆగస్టు 6
మేధో వైకల్యం (Intellectual Disability): ఆగస్టు 6
తక్కువ చూపు (Low Vision): ఆగస్టు 6 మరియు 20
అంధత్వం (Blindness): ఆగస్టు 6 మరియు 20
ఆన్‌లైన్‌లో UDID వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు లేదా దరఖాస్తు చేయలేని వారు కూడా సంబంధిత పత్రాలతో శిబిరాలకు హాజరై నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
తప్పనిసరిగా తీసుకురావాల్సిన పత్రాలు:
ఆధార్ కార్డు
మీ-సేవ రశీదు
ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్
అవసరమైన వైద్య నివేదికలు (ఉంటే)
పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని UDID కార్డు పొందాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు విజ్ఞప్తి చేశారు.

