తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసినసమావేశం
. భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిజెపి నాకు కూడా ఒక్క నోటీస్ ఇచ్చారు. నీకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం తొలగిస్తున్నాం. సెక్యూరిటీ తగ్గిస్తున్నాం అని లేఖ రాశారు. ఏమైనా థ్రెట్ ఉంటే మాత్రానే సెక్యూరిటీ ఇస్తామని చెప్పారు. సరే బాగానే ఉన్నది మరి మైనంపల్లి హన్మంతరావు ఏం కూంబింగ్ ఆపరేషన్లు చేశాడని, ఏ తీవ్రవాద సంస్థ, ఏ మావోయిస్టులు ఆయనను టార్గెట్ చేశారని 2+2 సెక్యూరిటీ ఇచ్చారు..? అని ప్రశ్నించారు.
కొండా మురళీ ఎమ్మెల్సీ కాదు, కార్పొరేషన్ చైర్మన్ కాదు. ఆయనకు 2+2 సెక్యూరిటీ ఇచ్చారు.. ఆయనకు ఏ హోదా ఉందని 2+2 సెక్యూరిటీ ఇచ్చారు..? అనుముల తిరుపతి రెడ్డి, అనుముల కొండల్ రెడ్డి ఏం కూంబింగ్ ఆపరేషన్లు చేశారని, ఏ ఉగ్రవాద సంస్థతో ముప్పు ఉందని, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక సెమీ ఆటోమేటెడ్ వెపన్స్ ఇచ్చారు..? సునీతా మహేందర్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ వారికి కూడా గన్‌మెన్లను ఇచ్చారని అడిగారు. అనుములు తిరుపతి రెడ్డికి ఉన్న అర్హత ఏంటి..?పెద్ది సుదర్శన్ రెడ్డి లేని అర్హత ఏంటీ.. చెప్పాలన్నారు.
సత్యవతి రాథోడ్ తెలంగాణ రాష్ట్రంలో తొలి గిరిజన మహిళా మంత్రి.. ఆమె ఇప్పుడు మాజీ మంత్రి, మాలోతు కవిత మాజీ ఎంపీ.. వారి గన్‌మెన్లను తీసేశారు. జోగు రామన్న మాజీ మంత్రి ఆయన గన్‌మెన్లను తొలగించారు.. అదే జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డికి 2+2 గన్‌మెన్లను ఇచ్చారు ఎందుకు..? అని అడిగారు. కుందూరు జానారెడ్డి ప్రస్తుత హోదా ఏంటి..? ఆయనకు 2+2 గన్‌మెన్లను ఇచ్చి, అత్యాధునిక బుల్లెట్‌ప్రూఫ్ వాహనం ఇచ్చారు. జానారెడ్డి మాజీ మంత్రి అయితే సత్యవతి రాథోడ్, జోగు రామన్న కూడా మాజీ మంత్రులే కదా. మరి వీళ్లకు ఎందుకు సెక్యూరిటీ తొలగించారు..? బీఆర్ఎస్ నాయకులకు ఒక న్యాయం.. కాంగ్రెస్ నాయకులకు ఒక న్యాయమా..? ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అని ప్రశ్నించారు.

