Friday, August 28, 2026
HomeEditorialచాక్లెట్‌ ఆశచూపి.. చిన్నారిపై లైంగిక దాడి

చాక్లెట్‌ ఆశచూపి.. చిన్నారిపై లైంగిక దాడి

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే మల్కాజ్గిరి న్యూస్ : అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారికి చాక్లెట్‌ ఆశచూపి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై మల్కాజిగిరి పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారు. ఎస్‌హెచ్‌వో విజయ్‌కుమార్, స్థానికుల కథనం ప్రకారం.. మల్లికార్జున్‌నగర్‌కు చెందిన రవికుమార్‌ టెంట్‌హౌస్‌లో పనిచేస్తున్నాడు. ఈనెల 26న మధ్యాహ్నం సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ కనిపించింది. చాక్లెట్‌ ఇస్తానని పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడుస్తూ వెళ్లి తల్లికి చెప్పడంతో మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించారు. వారు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.