చాక్లెట్ ఆశచూపి.. చిన్నారిపై లైంగిక దాడి
భీమ్ ఇండియా టుడే మల్కాజ్గిరి న్యూస్ : అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశచూపి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై మల్కాజిగిరి పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారు. ఎస్‌హెచ్‌వో విజయ్‌కుమార్, స్థానికుల కథనం ప్రకారం.. మల్లికార్జున్‌నగర్‌కు చెందిన రవికుమార్ టెంట్‌హౌస్‌లో పనిచేస్తున్నాడు. ఈనెల 26న మధ్యాహ్నం సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ కనిపించింది. చాక్లెట్ ఇస్తానని పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడుస్తూ వెళ్లి తల్లికి చెప్పడంతో మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించారు. వారు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు...