Friday, August 28, 2026
HomeEditorialఘనంగా చత్రపతి సాహు మహారాజ్ 152 వ జయంతి

ఘనంగా చత్రపతి సాహు మహారాజ్ 152 వ జయంతి

📰 Generate e-Paper Clip

  1. హుజురాబాద్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలొ భీమ్ ఇండియా టుడే న్యూస్ :- చత్రపతి సాహు మహారాజ్ 152 వ జయంతి ఉత్సవం హుజురాబాద్ పట్టణంలోని స్థానిక టి డబ్ల్యూ జేఎఫ్ కార్యాలయంలో బీసీ జేఏసీ అధ్యక్షులు సందేల వెంకన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ చత్రపతి సాహు మహారాజ్ జయంతి ఉత్సవాన్ని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేసినారు ఈనాడు బడుగు బలహీన వర్గాల వారు కొంతవరకు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారంటే ఆనాడు చత్రపతి సాహు మహారాజ్ 1902 వ సంవత్సరంలో తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం మూలంగానే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు అతని ఆశయానికి అనుగుణంగా రాజ్యాంగంలో రిజర్వేషన్ల గురించి పొందుపరచడం జరిగిందని అన్నారు విద్య కుల వివక్ష మహిళా సాధికారత కొరకు ఆనాడు అతను తీసుకున్నటువంటి నిర్ణయమే ఈనాడు బలంగా పనిచేస్తున్నందున చత్రపతి సాహు మహారాజును బడుగు బలహీన వర్గాల బిడ్డలు ప్రతిరోజు అతని సేవలు నెమరు వేసుకోవలసిన బాధ్యత ప్రతి బడుగు బలహీన వర్గాలకు చెందిన పౌరుని పైన ఉంటుందని నొక్కి చెప్పినారు చత్రపతి సాహు మహారాజ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఈనాటి కేంద్ర ప్రభుత్వము బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు ప్రత్యేక శ్రద్ధ వహించి బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు చిలుక మారి శ్రీనివాస్ ఇప్పకాయల సాగర్ మున్సిపల్ కౌన్సిలర్ ఇల్లందుల సమ్మయ్య అసిస్టెంట్ ప్రొఫెసర్ తడికమళ్ళ శేఖర్ బీసీ సంక్షేమ సంఘం హుజరాబాద్ నియోజకవర్గం మహిళా ప్రధాన కార్యదర్శి దేవసాని ప్రియదర్శిని బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గజ్వేల్ మధుసూదన్ అంబేద్కర్ కమిటీ అధ్యక్షులు ఆడెపు సురేందర్ కొలిపాక క్రాంతి మల్లేశం పోగు సమ్మయ్య తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు
RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.