భీమ్ ఇండియా టుడే న్యూస్ :-హుజురాబాద్ పురపాలక సంఘ కార్యాలయము నందు గౌరవ చైర్ పర్సన్ శ్రీమతి సుహాసిని రోంటాల గారి అధ్యక్షతన పట్టణ ప్రస్తుత ఎల్ నినో ప్రభావము – నీటి సరఫరా ఇబ్బందులపై నీటి సరఫరా విభాగం సిబ్బంది తో విస్తృత స్థాయి సమీక్ష స్థాయి సమీక్ష సమావేశము ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి సమావేశములో వార్ధుల వారిగా ఉన్నటువంటి పవర్ బోర్లు, చేతి పంపులు మరియు బావులకు సంబంధించి ప్రస్తుత నీటి నిల్వల పరిశీలన చేసి మరియు బోర్ల యొక్క మరమ్మత్తులు యుద్ద ప్రాతిపదికన చేపట్టవలసినదిగా సూచిoచనైనది.
పట్టణములో నీటి వృదా ను అరికట్టే విధముగా నల్లాలకు గేటు వాల్ బిగించడం , అక్రమ నల్లాలను గుర్తించడం, అక్రమముగా మోటార్ల ద్వార నల్లా నీటిని వాడుకొనే యజమానుల పై చట్టపరమైన చర్యలు తీసుకొనేటట్లు సూచించడం జరిగినది. ప్రస్తుతము భూగర్బ జలాలు అడుగంటుతున్న నేపథ్యములో మునిసిపల్ కు చెందిన మంచినీటి బావులలో నీటి నిల్వలపై చర్చించి అవసరమైన సమయములో బావుల ద్వార మంచినీటిని వాడుకొనే విధముగా ప్రైవేట్ బావులను అద్దెకు తీసుకొనుటకు గాను ఆదేశించడం జరిగినది. ఆలాగే నీటిని పొదుపుగా వాడుతూ నీటి సంరక్షణ చర్యలను పాటించాలని, ప్రతి ఒక్కరు విధిగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవలసినదిగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగినది.
ఇట్టి సమావేశము నందు మునిసిపల్ కమీషనర్ శ్రీ బి.కిషన్ గారు, మునిసిపల్ ఇంజినీర్ శ్రీ డి. నరేష్ గారు పాల్గొన్నారు.

