Friday, August 28, 2026
HomeEditorialఈ ఏడాది కృష్ణా నదిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలుసు.

ఈ ఏడాది కృష్ణా నదిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలుసు.

📰 Generate e-Paper Clip

“పట్టిసీమ వృథా” అన్నవాళ్లు… ఈ ఏడాది కృష్ణా డెల్టా రైతుల కళ్లలోకి చూసి అదే మాట చెప్పగలరా?

ఈ ఏడాది కృష్ణా నదిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలుసు.

ఎగువన అల్మట్టి నిండాలి… తర్వాత నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల… ఇవన్నీ నీరు పొందిన తర్వాతే కృష్ణా డెల్టాకు నీరు చేరుతుంది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు.

అలాంటి సమయంలో గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణాకు మళ్లించడమే లక్షలాది రైతులకు ఊపిరి పోసింది.

ఒకప్పుడు…“పట్టిసీమ వృథా… డబ్బు దుబారా… రాజకీయ స్టంట్…” అని విమర్శించారు.

ఈరోజు అదే పట్టిసీమ లేకపోతే ఏమయ్యేది?

సుమారు 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టాలో ఖరీఫ్ సాగు ప్రమాదంలో పడేది. ఎకరానికి సగటున 30 క్వింటాళ్ల దిగుబడి లెక్కన, ప్రస్తుత MSP ప్రకారం ఒక్క ఖరీఫ్ పంట విలువే దాదాపు ₹9,600 కోట్లు.

పట్టిసీమ నిర్మాణ వ్యయం?సుమారు ₹1,300–1,500 కోట్లు.అంటే…ఒక్క ఎల్‌నినో ఏడాదిలో కాపాడిన పంట విలువే, ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి ఎన్నో రెట్లు ఎక్కువ.

ఇదే దూరదృష్టి అంటే.

ఇదే నీటి అనుసంధానం విలువ.

ఇదే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి ఎందుకు అవసరమో చెప్పే సజీవ ఉదాహరణ.

ప్రాజెక్టుల విలువ వర్షాలు బాగా పడిన సంవత్సరాల్లో కాదు… నదులు ఎండిపోయిన సంవత్సరాల్లో తెలుస్తుంది.

పట్టిసీమ ఖర్చు కాదు… అవసరమైనప్పుడు రాష్ట్రాన్ని నిలబెట్టే బీమా పాలసీ. ఈ ఏడాది ఆ బీమా క్లెయిమ్ అయిన సంవత్సరం.

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.