Thursday, November 12, 2026
HomeEditorialతెలంగాణ ఉద్యమకారుల ఫోరం భూపాలపల్లి జిల్లా

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం భూపాలపల్లి జిల్లా

📰 Generate e-Paper Clip

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పున్నం రవి నియామకం

భీమ్ ఇండియా టుడే న్యూస్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఉమ్మడి రేగొండ మండలంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఉద్యమ నాయకుడు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగాయిపల్లి గ్రామానికి చెందిన పున్నం రవి గారిని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పున్నం రవి చేసిన విశేష సేవలు, ఉద్యమ సమయంలో ఎదుర్కొన్న కేసులు, త్యాగాలు, పోరాట స్ఫూర్తిని గుర్తించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్  వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజినీకాంత్ ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా పున్నం రవి గారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో తాను చేసిన సేవలను, ఎదుర్కొన్న కేసులను గుర్తించి తనపై నమ్మకంతో భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజినీకాంత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధనకు, వారి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని పున్నం రవి  పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.