Saturday, October 24, 2026
Homeతెలంగాణఆపదలో ఉన్న వారిని అందుకుంటూ

ఆపదలో ఉన్న వారిని అందుకుంటూ

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్.సీఎంఆర్ఎఫ్ చెక్కలతో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నాం…వొడితల ప్రణవ్.. 

ఆపదలో ఉన్న వారిని అందుకుంటూ,ప్రతి గడపకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శుక్రవారం రోజున హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఇంచార్జీ ప్రణవ్ పంపిణీ చేశారు.హుజరాబాద్ పట్టణ,మండల,కమలాపూర్,వీణవంక,ఇల్లందకుంట మండలాలకు చెందిన 53లక్షల విలువచేసే 153 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుందని,వారి సంక్షేమానికి ఎప్పుడు ముందుంటామని తెలిపారు.ఉచిత బస్సు,200 యూనిట్ల ఉచిత విద్యుత్,ఇందిరమ్మ ఇళ్లు,రేషన్ కార్డులు,సన్నబియ్యం,రైతు భరోసా,రుణమాఫీ,సన్న వడ్లకు బోనస్ లాంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలు చేరవేస్తున్నామని అన్నారు.సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు తప్ప ఇక్కడ కౌశిక్ రెడ్డి చేసింది ఏం లేదని ఎద్దేవా చేశారు.ప్రభుత్వం ఇచ్చే చెక్కుల పంపిణీ లో ముఖ్యమంత్రి ఫోటో లేకుండా ఇవ్వడం కౌశిక్ రెడ్డి అవివేకతనానికి నిదర్శనం అని అన్నారు.ఈ కార్యక్రమంలో హుజరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని,కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు,పట్టణ,మండలాల అధ్యక్షులు,మహిళా అధ్యక్షురాల్లు,మార్కెట్ చైర్ పర్సన్లు,డైరెక్టర్లు,దేవాలయ,అన్ని గ్రామాల సర్పంచులు,ప్రజా ప్రతినిధులు,సీనియర్ కాంగ్రెస్,బ్లాక్ కాంగ్రెస్, సేవాదళ్,యువజన,యూత్,బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ సెల్,అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.