గ్రేటర్ విశాఖ మేయర్ అభ్యర్థిగా కరణం కీర్తన గ్రేస్
బహుజన బిడ్డను అఖండ మెజార్టీతో గెలిపించాలని దళిత, బహుజన మేధావులకు పిలుపు
భీమ్ ఇండియా టుడే న్యూస్ విశాఖపట్నం:గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా బహుజన బిడ్డ, తమ ఇంట్లో పెరిగిన అమ్మాయి శ్రీ కరణం కీర్తన గ్రేస్ బరిలో నిలిచారని, ఆమెను అఖండ మెజార్టీతో గెలిపించేందుకు దళిత, బహుజన మేధావులు, సంఘాల నాయకులు సమైక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మహాత్మా జ్యోతిరావు పూలే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బహుజన సమాజం రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని పేర్కొన్నారు. చదువుకున్న మేధావులు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ, పాలనలో భాగస్వాములు కావాలన్నది పూలే, అంబేద్కర్ ఆశయమని తెలిపారు. బహుజన సమాజ్ పార్టీ ద్వారా బహుజనులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం పొందే అవకాశం లభించిందని పేర్కొన్నారు.
కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా బహుజనుల ఐక్యతను చాటుతూ కరణం కీర్తన గ్రేస్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. దళిత, బహుజన సంఘాలు వివిధ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లొంగకుండా, తమ సామాజిక వర్గాల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని ఐక్యంగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు.
బహుజన మేధావులు, యువత, సామాజిక సంఘాల ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కరణం కీర్తన గ్రేస్‌కు మద్దతుగా నిలవాలని, బహుజన సమాజంలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. పూలే, అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగా బహుజనుల రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు.

