గాంధీనగర్ గ్రామంలో దోమల నివారణకు ఫాగింగ్
భీమ్ ఇండియా టుడే న్యూస్ భీమదేవరపల్లి హన్మకొండ గాంధీనగర్: గ్రామంలో దోమల బెడదను నివారించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రతి వీధిలో ఫాగింగ్ మిషన్ ద్వారా దోమల నివారణకు పొగ పట్టించారు. దోమల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా, వ్యాధుల వ్యాప్తికి అవకాశం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా ఫాగింగ్ చేపట్టినట్లు గ్రామ పంచాయతీ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చని సూచించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కేతిరి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పారిశుధ్య నిర్వహణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు గ్రామ పంచాయతీ తరఫున అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుర్ర సమ్మయ్య గౌడ్, వార్డు సభ్యులు చిదురాల పద్మ, పారందుల క్రాంతికుమార్, తూముల ఎల్లయ్య, సందెల శ్వేత, తాళ్లపల్లి చిన్న, రాజయ్యతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
దోమల నివారణకు గ్రామ పంచాయతీ చేపట్టిన ఈ చర్యలపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశుధ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజాప్రతినిధులు కోరారు.

