ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా గ్రామ పంచాయతీ చర్యలు
గాంధీనగర్ గ్రామంలో దోమల నివారణకు ఫాగింగ్ భీమ్ ఇండియా టుడే న్యూస్ భీమదేవరపల్లి హన్మకొండ గాంధీనగర్: గ్రామంలో దోమల బెడదను నివారించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రతి వీధిలో ఫాగింగ్ మిషన్ ద్వారా దోమల నివారణకు పొగ పట్టించారు. దోమల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా, వ్యాధుల వ్యాప్తికి అవకాశం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా...